Australian Open 2024 : భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న(Rohan Bopanna) చరిత్ర సృష్టించాడు. రోహన్ బోపన్న-మాట్ ఎబ్డెన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీ-ఫైనల్(Australian Open Semi Final) కు చేరుకున్నారు. 43ఏళ్ల రోహన్ బోపన్న, మాట్ ఎబ్డెన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 6-4, 7-6 (7-5)తో విజయం సాధించి సెమీ ఫైనల్‌కు చేరుకున్నారు. ఈ విజయం తర్వాత, రోహన్ బోపన్న-మాట్ ఎబ్డెన్ పురుషుల డబుల్స్‌లో ప్రపంచ నంబర్-1గా నిలిచారు.
అర్జెంటీనా జోడిపై విజయం:
ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా(Argentina) కు చెందిన మాక్సిమో గొంజాలెజ్-ఆండ్రెస్ మోల్టెనీలు రోహన్ బోపన్న -మాట్ ఎబ్డెన్‌లతో తలపడ్డారు. రోహన్ బోపన్న, మాట్ ఎబ్డెన్ ప్రత్యర్థి ఆటగాళ్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. మాక్సిమో గొంజాలెజ్, ఆండ్రెస్ మోల్టెని 6-4, 7-6 (7-5)తో ఓడిపోయారు.
అంతకుముందు, రోహన్ బోపన్న - మాట్ జోడి నెదర్లాండ్స్‌కు చెందిన వెస్లీ కూల్‌హాఫ్ క్రొయేషియాకు చెందిన నికోలా మెక్టిక్ జోడీని వరుస సెట్లలో ఓడించారు. రెండో సీడ్‌లో ఉన్న భారత్-ఆస్ట్రేలియా జోడీ ప్రపంచ మాజీ నంబర్‌వన్ జోడీ కూల్‌హాఫ్, మెక్టిక్‌పై 7-6 7-6 తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న-మాట్ ఎబ్డెన్ ద్వయం 6-4, 7-6 (7-5)తో అర్జెంటీనాకు చెందిన మాక్సిమో గొంజాలెజ్-ఆండ్రెస్ మోల్టెని జోడీని ఓడించింది.
Also Read: మ్యాచ్‌కు ముస్తాబైన భాగ్యనగరం.. భారత్ తుది జట్టు ఇదే!
WATCH: