Australia : కంగారూ జట్టును భయపెట్టిన ఒమన్ జట్టు..!

అమెరికా,వెస్టీండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టీ20 వరల్డ్ కప్ లో పెద్ద జట్లకు,పసికూనలు వణుకుపుట్టిస్తున్నాయి. ఒమన్ జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 39 పరుగుల తేడాతో పోరాడి విజయం సాధించింది.

Australia : కంగారూ జట్టును భయపెట్టిన ఒమన్ జట్టు..!
New Update

Oman Team : టీ20 ప్రపంచకప్ (T20 World Cup) 10వ లీగ్ మ్యాచ్‌లో గ్రూప్-బిలో ఆస్ట్రేలియా (Australia), ఒమన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఒమన్ జట్టు కెప్టెన్ ఇలియాస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీని తర్వాత ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (Travis Head) 12 పరుగులు, కెప్టెన్ మిచెల్ మార్ష్ 14 పరుగులు చేసి మ్యాక్స్ వెల్ డకౌట్ అయ్యారు.

ఫలితంగా ఆస్ట్రేలియా జట్టు 8.3 ఓవర్లలో 50 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కలిసి వచ్చిన డేవిడ్ వార్నర్ (David Warner)-స్టోయినిస్ భాగస్వామ్యం ఆస్ట్రేలియా జట్టును పుంజుకుంది. వార్నర్ 51 బంతుల్లో 56, స్టోయినిస్ 36 బంతుల్లో 67 పరుగులు చేశారు.  ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు జోడించింది.

ఆపై బ్యాటింగ్ కు దిగిన ఒమన్ జట్టు 57 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి తడబడింది. అయితే అకస్మాత్తుగా ఒమన్ జట్టులోని అయాన్ ఖాన్, మెహ్రాన్ ఖాన్ భారీ ఇన్నింగ్స్ ఆడారు. దీంతో ఒమన్ జట్టు స్కోరు వేగంగా పెరిగింది. ఒమన్ జట్టు స్కోరు 100 పరుగులు దాటుతుండగా, దూకుడుగా ఆడిన అయాన్ ఖాన్ 36 పరుగుల వద్ద, మెహ్రాన్ ఖాన్ 27 పరుగుల వద్ద ఔటయ్యారు.

చివరకు ఒమన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసి ఓడిపోయింది. ఆస్ట్రేలియా 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, స్టోయినిస్ 36 బంతుల్లో 6 సిక్సర్లు, 2 ఫోర్లతో సహా 67 పరుగులు చేసి ఆస్ట్రేలియా జట్టును కాపాడాడు, అదేవిధంగా బౌలింగ్‌లో స్టార్క్ గాయంతో పెవీలియన్ చేరగా,ఆ బాధ్యతలను  స్టోయినిస్ తీసుకున్నాడు.3 ఓవర్లు బౌలింగ్ చేసిన స్టోయినిస్ 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో టీ20 క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి బౌలింగ్‌లో 3 వికెట్లు తీసిన 3వ ఆటగాడిగా స్టోయినిస్ నిలిచాడు. అతని కంటే ముందు డ్వేన్ బ్రావో, షేన్ వాట్సన్ ఈ ఘనత సాధించారు.

Also Read : ఏపీ ప్రభుత్వ కార్యాలయాలపై స్పెషల్ ఫొకస్ .. సిట్‌ ఆఫీసుకు సీల్‌..!

#oman #australia #2024-t20-world-cup
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe