/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/aus-2-jpg.webp)
ఆరోసారి ప్రపంచ ఛాంపియన్ గా గెలిచారు. టోర్నీ మొదట్లో కష్టపడ్డా తరువాత నిలదొక్కుకుని ఫైనల్ లో మంచి ఆటతీరుతో కప్పును గెలుసుకున్నారు. మ్యాచ్ తరువాత ఆసీస్ సంబరాలు చేసుకున్నారు. ఆసీస్ ఆటగాళ్లు తమ జీవితాల్లో అపురూపమైన క్షణాలను ఆస్వాదించారు. హెడ్, లబూషేన్, మ్యాక్స్‌వెల్, కమిన్స్ ఇలా.. ప్రతి ఒక్క ఆసీస్ ఆటగాడు విజయ గర్వంతో ఊగిపోయారు. అంతా బాగానే ఉంది కానీ ఆ గర్వం కాస్తా ఆసీస్ ప్లేయర్ మిచెల్ మార్షల్ కు తలపొగరుగా మారింది. ఆనందం శ్రుతి మించి తానేం చేస్తున్నాడో కూడా తెలియకుండా పోయింది.
Also read:ఉత్కంఠభరిత పోటీలు.. బద్దలైన రికార్డులు.. ఈ వరల్డ్ కప్ సంచలనాలు ఇవే..
గ్రౌండ్ లో సంబరాలు అయిపోయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో కూడా పండగ చేసుకున్నారు ఆసీస్ ఆటగాళ్ళు. బీర్లు తాగుతూ సెలబ్రేట్ చేసుకున్నారు. అంత వరకూ అందరు ఆటగాళ్ళూ చేసేదే...తప్పు లేదు. కానీ ఆసీస్ ఆటగాడు మిచెల్ మార్షల్ మరి కొంచెం ముందుకు వెళ్ళి ట్రోఫీ మీద కాళ్ళు పెట్టి మరీ ఫోటోలకు పోజు ఇచ్చాడు. అది కాస్తా ఇప్పుడు వైరల్ అయిపోయింది. క్రికెట్ అభిమానులు మార్ష్ అనుచిత ప్రవర్తనను తప్పుబడుతున్నారు. ప్రతి క్రికెటర్ ఎంతో అపురూపంగా భావించే వరల్డ్‌కప్ ట్రోఫీకి ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ మండిపడుతున్నారు. ఎంత గెలిస్తే మాత్రం ఇంత అహంకారమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Mitchell Marsh with the World Cup. pic.twitter.com/n2oViCDgna
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 20, 2023