ODI World Cup 2023: ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి

ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్‌ టీమ్‌ల మధ్య జరుగుతున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది.

New Update
ODI World Cup 2023: ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి

ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్‌ టీమ్‌ల మధ్య జరుగుతున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌ 14.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 84 పరుగుల వద్ద ఉన్న సమయంలో వర్షం ప్రారంభమైంది. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. 23 ఓవర్ల ఈ మ్యాచ్‌లో మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణిత ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.

అనంతరం లక్ష్య చేధనకు దిగిన నెదర్లాండ్స్ టీమ్‌ తన తొలి ఓవర్లోనే ఓపెనర్‌ వికెట్‌ కోల్పోయింది. అనంతరం స్టార్క్ హ్యాట్రిక్ సాధించడంతో నెదర్లాండ్స్ బ్యాటర్లు ఓడౌడ్ (0), వెస్లీ బరేసీ (0), బాస్ డీ లీడ్ (0) వచ్చిన వారు వచ్చినట్లే వెనుదిగారు. దీంతో టార్గెట్‌ను చేధించడంలో నెదర్లాండ్స్ బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఇవాళ జరగాల్సిన భారత్‌-ఇంగ్లండ్ మ్యాచ్‌ వర్షం వల్ల రద్దైంది. గౌహతిలో ఇవాళ ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో టాస్‌ కూడా వేయలేదు. మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

మధ్య మధ్యలో వరుణుడు కాస్త శాంతించినా గ్రౌండ్‌ సిబ్బంది పిచ్‌ను ఆరబెట్టే సమయానికి మళ్లీ వర్షం పడటంతో పిచ్‌ మొత్తం తడిసింది. దీంతో ఆటను రద్దు చేస్తున్నట్లు అంప్లైర్లు ప్రకటించారు. కాగా ఇంగ్లండ్‌తో జరిగేదీ ప్రాక్టీస్‌ మ్యాచ్చే అయినా అభిమానులు మాత్రం స్టేడియానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. కానీ వారి అశలను అడియాశలు చేస్తూ వరుణుడు మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు శుక్రవారం జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై న్యూజిలాండ్‌, శ్రీలంకపై బంగ్లాదేశ్‌ టీమ్‌లు విజయం సాధించాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు