Bihar: పార్కింగ్‌ విషయంలో గొడవ..నలుగురి హత్య..పోలీసుల అదుపులో ఆరుగురు!

దుకాణం ముందు కారు పార్కింగ్‌ చేశారని జరిగిన వాగ్వాదంలో నలుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఆరుగురు నిందితుల్ని అరెస్ట్‌ చేసినట్లు ఔరంగాబాద్‌ పోలీసులు తెలిపారు.

New Update
Bihar: పార్కింగ్‌ విషయంలో గొడవ..నలుగురి హత్య..పోలీసుల అదుపులో ఆరుగురు!

Aurangabad News: కార్‌ పార్కింగ్‌ విషయంలో మొదలైన గొడవ నలుగురి హత్యకు (Murder) దారి తీసింది. ఈ దారుణం బీహార్‌ (Bihar) లోని ఔరంగాబాద్ (Aurangabad) జిల్లా నబీనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ హోటల్‌ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మలుపు దగ్గర కార్‌ పార్కింగ్ విషయంలో కారు డ్రైవర్‌ కు, స్థానికులకు మధ్య పెద్ద వివాదం చోటు చేసుకుంది.

ఈ క్రమంలోనే నలుగురు వ్యక్తులు హత్యకు గురైయ్యారు. ఈ హత్యకు సంబంధించిన కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. మరి కొంత మంది కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు కు సంబంధించి రెండు వేరు వేరు ఎఫ్‌ఐఆర్‌ లు నమోదు అయినట్లు ఔరంగాబాద్‌ పోలీసు సూపరింటెండెంట్‌ స్వప్న గౌతమ్‌ మేష్రామ్‌ మంగళవారం తెలిపారు.

కారు పార్క్ చేయడంతో..

నబీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని టెటారియా మలుపు వద్ద దుకాణం ముందు కారు పార్కింగ్‌ చేయడంపై వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వివాదంలో కారులో వెళ్తున్న ఓ యువకుడు దుకాణంలో కూర్చున్న వృద్ధుడిని కాల్చిచంపాడు. మృతి చెందిన వృద్ధుడిని మహులి (నబీనగర్) గ్రామానికి చెందిన రాంశరణ్ చౌహాన్ (60 సంవత్సరాలు)గా గుర్తించారు. ఈ సంఘటనతో గ్రామస్తులు ఆగ్రహించి, పాలము జిల్లా హైదర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి నుండి వచ్చిన ముజాహిద్ రైన్, అర్మాన్ అన్సారీ, చమన్ మన్సూరిలను చంపారు, వకీల్ అన్సారీ ,అజిత్ శర్మ తీవ్రంగా గాయపడ్డారు.

నబీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టెటారియా మోర్ సమీపంలోని ఓ దుకాణం ముందు కారు ఆపివేసిన తర్వాత తలెత్తిన వివాదంలో కారులో ఉన్న వ్యక్తి కాల్పులు జరిపినట్లు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) స్వప్న జి మెష్రామ్ మంగళవారం తెలిపారు. దీంతో దుకాణంలో కూర్చున్న స్థానిక పెద్దాయన మృతి చెందాడు. దీని తరువాత, స్థానిక ప్రజలు కారులో ఉన్న ఐదుగురిని కొట్టారు, ఇందులో ముగ్గురు మరణించారు, ఇద్దరిని చికిత్స కోసం ఉన్నత కేంద్రానికి పంపారు.

ఈ వ్యవహారంపై ఇరువర్గాల నుంచి ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఈ ఘటనపై సీనియర్‌ అధికారులంతా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేసులో నిందితులందరినీ గుర్తించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ బృందాన్ని కూడా పిలిపించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనకు కారకులైన వారిని ఎంతమాత్రం వదిలిపెట్టబోమని అన్నారు. ఈ విషయానికి సంబంధించిన నిందితులను పట్టుకునేందుకు సబ్‌ డివిజనల్‌ పోలీస్‌ అధికారి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అరెస్టయిన నిందితులను అలోక్ చౌహాన్, సుజిత్ చౌహాన్, ముఖేష్ చౌహాన్, సూరజ్‌లాల్ చౌహాన్, దశరత్ చౌహాన్, దినేష్ రామ్‌లుగా గుర్తించారు.

Also read: రూ. 500 నోటు పై రాముడి ఫోటో.. ఆర్బీఐ రిలీజ్..నిజమేనా?

Advertisment
Advertisment
తాజా కథనాలు