Hyderabad : జూబ్లీహిల్స్‌లో ఫ్లెక్సీల వివాదం..మహిళా కార్పొరేటర్‌పై దాడి

హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లో ఫ్లెక్సీల వివాదం జరిగింది. దీనికి సంబంధించి వెంగళరావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్య రావు మీద స్థానిక మహిళలు దాడి చేశారు. నిన్న రాత్రి ఈ సంఘటన జరిగింది.

New Update
Hyderabad : జూబ్లీహిల్స్‌లో ఫ్లెక్సీల వివాదం..మహిళా కార్పొరేటర్‌పై దాడి

Attack On Corporator : జూబ్లీహిల్స్(Jubilee Hills) నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ బిఆర్ఎస్(BRS) కార్పొరేటర్ దేదీప్య రావు(Dedeepya Rao) మీద కొందరు మహిళలు(Women's) మూకమ్మడి దాడి చేశారు. ఫ్లెక్సీల విషయంలో కారులో వెళుతున్న ఆమె మీద దాడికి దిగారు. దీంతో దేదీప్యకు స్వల్పంగా గాయాలయ్యాయి. యూసుఫ్‌గూడ ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఫ్లెక్సీలు రోడ్ల పక్కన ఉండటంతో వాటిని తొలగించాలంటూ కార్పొరేటర్ దేదీప్య జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే 3, 4 సార్లు ఆమె ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో మంగళవారం రాత్రి ఫ్లెక్సీలు తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది వచ్చారు. తొలగింపు సమయంలో అక్కడికి వచ్చిన కొందరు స్త్రీలు ఫ్లెక్సీలను తొలగించడానికి వీల్లేదంటూ వారిని అడ్డుకున్నారు. దీంతో జీహెచ్‌ఎంపీ సిబ్బంది దేదీప్యకు కాల్ చేసి విషయం చెప్పారు.

కాంగ్రెస్ ఫ్లెక్సీలు తీయమన్నందుకే..

విషయం తెలుసుకున్న కార్పొరేటర్ వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మహిళలతో మాట్లాడ్డానికి ప్రయత్నించారు. అయితే వారు ఆమెతో వాగ్వాదానికి దిగారు. తరువాత దాడి కూడా చేశారు. దీంతో దేదీప్యకు స్వల్ప గాయాలయ్యాయి. తనపై దాడి గురించి దేదీప్య వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త విజయ్ ముదిరాజ్‌తో కలిసి జూబ్లీహిల్స్‌ పీఎస్‌ లో ఫిర్యాదు చేశారు.

Also Read : Andhra Pradesh : ఎన్నికల వేళ రసవత్తరంగా అనంతపురం రాజకీయాలు

Advertisment
తాజా కథనాలు