Bharat Jodo Nyay Yatra: రాహుల్ గాంధీపై దాడి

బీహార్-బెంగాల్ సరిహద్దులో కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీపై దాడి జరిగింది. రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో కొందరు గుర్తు తెలియని దుండగులు ఆయన కారుపై దాడికి దిగారు. రాహుల్ గాంధీ కారు వెనక అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

New Update
Bharat Jodo Nyay Yatra: రాహుల్ గాంధీపై దాడి

Rahul Gandhi Attacked in West Bengal: భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ పై దాడి జరగడం కలకలం రేపింది. పశ్చిమబెంగాల్‌, బీహార్‌ సరిహద్దుల్లో రాహుల్‌ కారుపై గుర్తు తెలియని వ్యక్తుల రాళ్ల దాడి చేశారు. దుండగుల దాడిలో రాహుల్‌ కారు వెనక వైపు అద్దాలు పగిలి పొయాయ్యి. పశ్చిమబెంగాల్‌ మాల్ధా జిల్లాలో ఈ ఘటన సంభవించింది. ఈ ఉదయం బీహార్‌లోని కతిహార్‌ నుంచి యాత్ర ప్రారంభమైంది.

పశ్చిమబెంగాల్‌లో ప్రవేశించగానే రాహుల్‌ గాంధీ కారుపై దాడి జరిగింది. కారుపైకి ఎక్కి జనానికి అభివాదం చేస్తుండగా.. వెనుక నుంచి రాయి విసిరాడు గుర్తు తెలియని వ్యక్తి. ఈ దాడిలో పూర్తిగా ధ్వంసమైన కారు వెనుక భాగం అద్దాలు. పోలీసుల తీరుపై కాంగ్రెస్‌ నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌ విషయంలో భద్రతా వైఫ్యలంపై ఆందోళన వ్యక్తం చేశారు. దాడులతో యాత్రను విచ్ఛిన్నం చేయలేరని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్‌ స్పష్టం చేశారు. తృణమూల్‌ ప్రభుత్వం యాత్రకు సహకరించడం లేదని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తుంది. రాహుల్‌పై దాడితో నేషనల్‌ పాలిటిక్స్‌ మరింత హీటెక్కాయి.

Advertisment
తాజా కథనాలు