Attack On Jagan: రంగంలోకి 6 స్పెషల్ టీమ్స్.. జగన్ పై దాడి కేసులో విచారణ ముమ్మరం

సీఎంపై దాడి కేసులో విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. 20 మంది సిబ్బందితో 6 ప్రత్యేక బృందాలు విచారణ ముమ్మరంగా సాగిస్తున్నాయి. ఇప్పటికే.. దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు వివరాలను సేకరించారు.

New Update
Attack On Jagan: రంగంలోకి 6 స్పెషల్ టీమ్స్.. జగన్ పై దాడి కేసులో విచారణ ముమ్మరం

Special Investigation Team On YS Jagan Attack: సీఎం జగన్‌పై దాడి కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి చేసిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ మేరకు స్పెషల్ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు. 20 మంది సిబ్బందితో 6 ప్రత్యేక బృందాలు విచారణ ముమ్మరంగా సాగిస్తున్నాయి. రాయితో దాడి చేశారా, ఎయిర్‌గన్‌తో టార్గెట్ చేశారా? ఇలా వివిధ కోణాల్లో విచారణ సాగుతోంది. సీసీ ఫుటేజీ, సెల్‌ఫోన్‌ డేటా ఆధారంగా దర్యాప్తు సాగుతోంది. ఇప్పటికే ఈ ఘటనపై ఈసీకి విజయవాడ సీపీ కాంతిరాణా నివేదిక పంపారు.

సీఎం జగన్‌పై దాడితో ఇంటలిజెన్స్‌ అధికారులు రంగంలోకి దిగారు. స్పెషల్ టీమ్స్ విజయవాడలో నిన్న సీఎంపై దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించాయి. చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాలు జల్లెడ పడుతున్నారు అధికారులు. దాడి చేసిందెవరు? దాడి తర్వాత నిందితులు ఎలా తప్పించుకున్నారు? తేల్చడమే లక్ష్యంగా విచారణ సాగుతోంది. భారీగా శబ్ధం రావడంతో ఎయిర్‌గన్‌తో కాల్చి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఆ ప్రతీకారంలో భాగంగానే సల్మాన్ హత్యకు కుట్ర.. తీహార్ జైలు నుంచి సుపారీ!

Advertisment
తాజా కథనాలు