kadapa: సీఎం ఇలాకాలో సీఐ పై దాడి.. 'కేసు నమోదు చేయని ఎస్పీ'..!

కడపలో సీఐ అనిల్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు బలిజ సంఘం నేతలు. ఘటనపై ఫిర్యాదు చేసేందుకు సీఐ భార్య వెళ్లితే ఎస్పీ కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. పోలీసులకే భద్రత లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు.

kadapa: సీఎం ఇలాకాలో సీఐ పై దాడి.. 'కేసు నమోదు చేయని ఎస్పీ'..!
New Update

Kadapa: ఏపీ సీఎం జగన్ రెడ్డి సొంత ఇలాకాలోనే పోలీసులకు భద్రత లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు కడప జిల్లా బలిజ సంఘ నేతలు హరిప్రసాద్, శివ. ఇంటెలిజెన్స్ సీఐ అనిల్ కుమార్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీఐ కుటుంబానికి 24గంటల్లో న్యాయం చేయకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. పోలీసు అధికారిని దాదాపు 20 మంది అతి దారుణంగా కోట్టడం బాధాకరమన్నారు. ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసేందుకు సీఐ సతీమణి వెళ్లితే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వక పోవడం సిగ్గు చేటని మండిపడ్డారు.

Also read: నాదెండ్ల మనోహర్ అరెస్ట్.. పవన్ సీరియస్ వార్నింగ్..!

పోలీసుల స్థలాలను లీజుకు ఇవ్వడమే పని పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేస్తే ఎస్సీ కేసు పెడతామని బెదిరించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. పోలీసులకు పోలీసులే సహకరించకపోతే ఇక ప్రజలకు రక్షణ ఎక్కడ? అని మండిపడ్డారు. ఎస్పీ వచ్చాకే పోలీసులపై దాడులు పెరిగాయన్నారు. రాత్రికి రాత్రి పంచాయతీ చేయడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకోని దాడులు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.

సీఐపై మయూర యాజమాన్యం దాడి చేయడం హేయమైన చర్య అని ఖండించారు. ఘటనను ఖండించాల్సింది పోయి కేసు నమోదు చేయకుండా వైసీపీ నేతలు అడ్డుకోవడం దేనికి సంకేతం అని నిలదీశారు. మయూర యాజమాన్యంపై 307 క్రింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజా సంఘాలతో కలిసి మయూర గార్డెనియా ముందు బైఠాయించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

#andhra-pradesh #cm-jagan #kadapa-district
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe