OM Birla: పార్లమెంట్ లో ఈరోజు దాడి (Parliament Attack) జరిగిన నేపథ్యంలో మరోకాసేపట్లో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. పార్లమెంట్ లో భద్రత వైఫల్యాలపై చర్చించనున్నారు. ఈ దాడిపై స్పందించిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహా పాస్ తీసుకొని సభలోకి దుండగులు వచ్చారని అన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.. సభలో వదిలిన పొగ ప్రమాదకరమైనది కాదు అని అన్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను కోరినట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో లోక సభలో విజిటర్స్ పాసులపై నిషేధం విధించారు. తదుపరి ఉత్తర్వుల వరకు ఈ బ్యాన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.
ALSO READ: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొత్తం నలుగురు అరెస్ట్..
లోక్‌సభలో కలకలం ఘటనలో మొత్తం నలుగురిని అరెస్టు చేసింది భద్రతా సిబ్బంది. హరియాణా, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు అధికారులు. హరియాణాకు చెందిన నీలం, మహారాష్ట్రకు చెందిన అమోల్ షిందే, కర్ణాటకకు చెందిన సాగర్ శర్మ, మనోరంజన్ పేర్లు అధికారులు వెల్లడించారు. హరియాణాలోని హిస్సార్, మహారాష్ట్రలోని లాతూర్, కర్ణాటకలోని మైసూర్ ప్రాంతానికి చెందిన వారిగా తెలిపారు.
భద్రతా ఉల్లంఘన ఘటన నేపథ్యంలో సీఆర్‌పీఎఫ్ డీజీ అనీష్ దయాల్ సింగ్ పార్లమెంటుకుచేరుకున్నారు..
ALSO READ: కీరవాణీ ఇంటి కోడలిగా మురళీమోహన్ మనవరాలు..పెళ్లి ఎప్పుడంటే!