Allu Arjun : బన్నీ ఫ్యాన్స్ కు మరో బ్యాడ్ న్యూస్.. ఆ డైరెక్టర్ తో అల్లు అర్జున్ సినిమా క్యాన్సిల్?

అల్లు అర్జున్ తో అట్లీ చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అయిందట. అట్లీ, అల్లు అర్జున్‌ మధ్య కథా చర్చలు జరిగాయట. అయితే రెమ్యునరేషన్ విషయంలో అట్లీ ఏకంగా రూ.80 కోట్ల వరకు డిమాండ్ చేయడంతో నిర్మాతలు ఒప్పుకోలేదట. దీంతో ఈ ప్రాజెక్ట్ సల్మాన్ ఖాన్ చేతికి వెళ్లినట్లు తెలుస్తోంది.

Allu Arjun : బన్నీ ఫ్యాన్స్ కు మరో బ్యాడ్ న్యూస్.. ఆ డైరెక్టర్ తో అల్లు అర్జున్ సినిమా క్యాన్సిల్?
New Update

Atlee - Allu Arjun Movie Shelved : బన్నీ ఫ్యాన్స్ కు బ్యాక్ టూ బ్యాక్ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న 'పుష్ప 2' రిలీజ్ మరోసారి వాయిదా పడినట్లు గత మూడు రోజులుగా నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి. అది విని బన్నీ ఫ్యాన్స్ నిజం కాదని అనుకున్నారు. కట్ చేస్తే.. నిన్న మూవీ టీమ్ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయినట్లు తెలిపి షాక్ ఇచ్చింది. పుష్ప 2 రిలీజ్ ను ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 6 కు వాయిదా వేయడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఇలాంటి తరుణంలోనే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది.

బన్నీ ప్రాజెక్ట్ సల్మాన్ చేతికి...

గత ఏడాది షారుఖ్ ఖాన్ తో 'జవాన్' సినిమా తీసి పాన్ ఇండియా వైడ్ సక్సెస్ అందుకున్న కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయనున్నట్లు గత కొన్ని నెలలుగా వార్తలు వినిపించాయి. అట్లీ కూడా అది నిజమేనని ధృవీకరించాడు. పుష్ప 2 తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందని అన్నారు. కట్ చేస్తే ఇప్పుడీ ప్రాజెక్ట్ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ చేతికి వెళ్లినట్లు తెలుస్తోంది.

Also Read : కాలి నడకన తిరుమలకు త్రివిక్రమ్.. పవన్ కోసమేనా?

అట్లీ, అల్లు అర్జున్‌ మధ్య కథా చర్చలు జరిగాయని, అయితే రెమ్యునరేషన్ విషయంలో అట్లీ ఏకంగా రూ.80 కోట్ల వరకు డిమాండ్ చేశాడని తెలుస్తోంది. దీంతో నిర్మాతలు లైట్ తీసుకున్నారని సమాచారం. కట్ చేస్తే ఇప్పుడు ఆ ప్రాజెక్టులోకి సల్మాన్ ఎంటరయ్యాడని బీ టౌన్ టాక్. అంతేకాదు తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఇది సెట్స్‌పైకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట.

#salman-khan #allu-arjun-atlee-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe