Atlee – Allu Arjun Movie Shelved : బన్నీ ఫ్యాన్స్ కు బ్యాక్ టూ బ్యాక్ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న ‘పుష్ప 2’ రిలీజ్ మరోసారి వాయిదా పడినట్లు గత మూడు రోజులుగా నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి. అది విని బన్నీ ఫ్యాన్స్ నిజం కాదని అనుకున్నారు. కట్ చేస్తే.. నిన్న మూవీ టీమ్ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయినట్లు తెలిపి షాక్ ఇచ్చింది. పుష్ప 2 రిలీజ్ ను ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 6 కు వాయిదా వేయడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఇలాంటి తరుణంలోనే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది.
పూర్తిగా చదవండి..Allu Arjun : బన్నీ ఫ్యాన్స్ కు మరో బ్యాడ్ న్యూస్.. ఆ డైరెక్టర్ తో అల్లు అర్జున్ సినిమా క్యాన్సిల్?
అల్లు అర్జున్ తో అట్లీ చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అయిందట. అట్లీ, అల్లు అర్జున్ మధ్య కథా చర్చలు జరిగాయట. అయితే రెమ్యునరేషన్ విషయంలో అట్లీ ఏకంగా రూ.80 కోట్ల వరకు డిమాండ్ చేయడంతో నిర్మాతలు ఒప్పుకోలేదట. దీంతో ఈ ప్రాజెక్ట్ సల్మాన్ ఖాన్ చేతికి వెళ్లినట్లు తెలుస్తోంది.
Translate this News: