Delhi Water Crisis: నీళ్ళ కొరకు నిరాహార దీక్ష.. విషమంగా మంత్రి ఆరోగ్యం

ఢిల్లీలో నీటి కొరత ఏర్పడంతో హర్యానా ప్రభుత్వం తమకు నీళ్లను విడుదల చేయాలని నీటి శాఖ మంత్రి అతిషి చేపట్టిన నిరాహార దీక్ష ఐదవ రోజుకు చేరుకుంది. ఆరోగ్యం క్షిణించడంతో అతిషిని ఆసుపత్రికి తరలించారు. ఆమె షుగర్ లెవల్స్ పడిపోయాయని.. ప్రస్తుతం ఐసీయూలో ఉంచినట్లు వైద్యులు చెప్పారు.

New Update
Delhi Water Crisis: నీళ్ళ కొరకు నిరాహార దీక్ష.. విషమంగా మంత్రి ఆరోగ్యం

Delhi Minister Atishi: ఢిల్లీలో నీటి కొరత ఏర్పడంతో హర్యానా ప్రభుత్వం తమకు నీళ్లను విడుదల చేయాలని నీటి శాఖ మంత్రి అతిషి చేపట్టిన నిరాహార దీక్ష (Hunger Strike) ఐదవ రోజుకు చేరుకుంది. ఆరోగ్యం క్షిణించడంతో మంత్రి అతిషిని ఆసుపత్రికి తరలించారు. కాగా ఆమె ప్రస్తుతం ఐసీయూలో ఉంచామని, నాలుగు రోజుల పాటు ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆమె షుగర్ లెవల్స్ కనిష్ట స్థాయికి పడిపోయాయని... ప్రస్తుతం ఆమె శరీరంలో షుగర్ లెవల్స్ 36కి పడిపోయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు చెప్పారు.

జాతీయ రాజధాని ఢిల్లీకి రోజుకు 100 మిలియన్ గ్యాలన్ల (MGD) నీటిని విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ, తీవ్ర సంక్షోభానికి దారితీసినందుకు హర్యానా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అతిషి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. మంగళవారం ఆమె నిరవధిక నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. అతిషి తన ప్రాణాలను పణంగా పెట్టి ఢిల్లీకి సరైన నీటి వాటా కోసం పోరాడుతోందని ఆప్ తన పత్రికా ప్రకటనలో పేర్కొంది.

హర్యానా ప్రభుత్వం ఢిల్లీ వాసులకు నీటిని అందించే వరకు, హత్నికుండ్ బ్యారేజీ గేట్లు తెరవని వరకు తన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతుందని అతిషి చెప్పారు. హర్యానా దేశ రాజధానికి ప్రతిరోజూ 100 మిలియన్ గ్యాలన్ల నీటి సరఫరాను తగ్గిస్తోందని, నీటి సంక్షోభాన్ని పెంచుతుందని, 28 లక్షల మంది నివాసితుల జీవితాలపై ప్రభావం చూపుతుందని AAP నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపించింది.

Also Read: కాన్వాయ్‌ ఆపి మరీ వినతి పత్రాలు స్వీకరించిన చంద్రబాబు!

Advertisment
తాజా కథనాలు