TDP Leader Atchannaidu: సీఎం జగన్ పై విమర్శల దాడికి దిగారు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. యువగళం సభ మొదలు నుంచి అణిచివేయాలని ప్రభుత్వం పూనుకుందని ఆరోపించారు. సభ నిర్వహణకు స్థలం అడిగితే అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. యువగళం ముగింపు సభకు ఆర్టీసీ బస్సులను అద్దెకు అడిగితే ఇవ్వకుండా అడ్డుపడ్డారని విమర్శించారు. ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు బస్సులు ఇస్తామంటే ఆర్టీఓ అధికారులతో వారిపై ఒత్తిడి తెచ్చింది వైసీపీ ప్రభుత్వం అని మండిపడ్డారు.
ALSO READ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో డీఎస్సీ నోటిఫికేషన్!
అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఎన్ని అడ్డంకులు సృష్టించిన ప్రజలు ముందుకొస్తారనడానికి నిన్న సభే నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు. 6 లక్షల మంది వస్తారని అనుకున్నాం కానీ మా అంచనాలకు కూడా అందనంత మంది వచ్చారని అన్నారు. టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిన్న సభ జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. సభ విజయవంతం అయిన సందర్బంగా ప్రజలందరికీ, టీడీపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. జనసేన కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు అని అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు జగన్ కు మధ్య పోటీ కాదు.. 5 కోట్ల ఆంధ్రులకు జగన్ కు మధ్య జరుగుతున్నా పోరాటం ఇది అని పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడు సభలు పెట్టి ప్రజలకు సందేశం ఇవ్వాలని ఆలోచిస్తున్నాం అని అన్నారు. నిన్న సభ నుంచి పెంటబాబు అనే వ్యక్తి తప్పిపోయాడు ఎవరికైనా తెలిస్తే తమ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలను కోరారు.
ALSO READ: అరెస్ట్ తరువాత పల్లవి ప్రశాంత్ ఎక్కడ ఉన్నాడంటే..
పోటీ చేసేందుకు వైసీపీలో అభ్యర్థులు లేరు: ప్రత్తిపాటి
సీఎం జగన్‌కు ఇప్పటికే ఓటమి భయాన్ని.. లోకేశ్ పరిచయం చేశారని అన్నారు ప్రత్తిపాటి పుల్లారావు. వైనాట్ 175 నుంచి పోటీకి అభ్యర్థులను వెతుక్కునే దుస్థితి వైసీపీది అన్ని చురకలు అంటించారు. జగన్‌కు ఓటమి తప్పదని ప్రశాంత్ కిశోర్ బృందం కూడా చెప్పేసిందని ఆరోపించారు. జగన్ వైఫల్యాలే టీడీపీ - జనసేన కూటమి విజయానికి బాటలు అని పేర్కొన్నారు.