Pension Scheme : రూ.7 పొదుపు.. ప్రతీనెలా 5 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌ గురించి తెలుసుకోండి!

వృద్ధాప్యంలో జీవితానికి ఆసరాగా ఉండేందుకు.. కేంద్రం గతంలో ఒక పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ పథకం కింద 60 సంవత్సరాల తర్వాత నెలకు రూ. 5 వేల చొప్పున పెన్షన్ పొందేందుకు అవకాశం ఉంటుంది. వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడకుండా ఉండే ఈ స్కీమ్‌ గురించి తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.

Pension Scheme : రూ.7 పొదుపు.. ప్రతీనెలా 5 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌ గురించి తెలుసుకోండి!
New Update

Financial Planning : రిటైర్మెంట్(Retirement) తర్వాత జీవితానికి సంబంధించిన ఆర్థిక ప్రణాళికను ముందు నుంచే వేసుకోవాలి. ఎందుకంటే పదవీ విరమణ తర్వాత అనేక రకాల ఆర్థిక సమస్యలు(Financial Problems) వేధించడం ప్రారంభిస్తాయి. అందుకే ఈ భారత ప్రభుత్వం(Indian Government) అందిస్తున్న పథకం గురించి తెలుసుకోండి. ఈ పథకం పేరు అటల్ పెన్షన్ స్కీమ్. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. ఈ పథకంలో మీరు కేవలం రూ.7 మాత్రమే పొదుపు చేసి 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా ఐదు వేల రూపాయల పెన్షన్ ప్రయోజనాన్ని పొందవచ్చు. అటల్ పెన్షన్ యోజన దేశంలో చాలా ప్రాచుర్యం పొందింది.

--> 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఈ కేంద్ర ప్రభుత్వ పథకం(Central Government Scheme) లో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఈ పథకంలో రిజిస్టర్ చేసుకున్న సమయంలో వయస్సు ఆధారంగా పెట్టుబడి మొత్తాన్ని నిర్ణయిస్తారు. 18 ఏళ్ల వయసులో ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే.. మీరు ప్రతిరోజూ రూ .7 పొదుపు చేయాలి. అంటే ప్రతి నెలా రూ .210 ఈ పథకంలో పెట్టుబడి(Investment) పెట్టాలి. మీరు 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఈ పెట్టుబడి పెట్టాలి. ఇలా చేస్తే 60 సంవత్సరాల తర్వాత మీరు ప్రతి నెలా ఐదు వేల రూపాయల పెన్షన్ ప్రయోజనాన్ని పొందుతారు.

--> రిటైర్మెంట్ తర్వాత జీవితంలో మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ పెన్షన్ మొత్తం పనిచేస్తుంది. భారత ప్రభుత్వ ఈ పథకానికి దేశవ్యాప్తంగా చాలా మంది దరఖాస్తు చేసుకుంటున్నారు.

Also Read : నష్టాల్లో స్టాక్ మార్కెట్.. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు

#investment #atal-pension-scheme #pension-scheme
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe