Atal Pension: గుడ్‌న్యూస్.. వాళ్లకి పెన్షన్ రూ.10వేలకు పెంపు ! అటల్ పెన్షన్ యోజన పథకంలో గ్యారెంటీ పెన్షన్‌ను రూ.10 వేలకి పెంచే దిశగా కేంద్రం పరిశీలన చేస్తోంది. ఈ నెల 23న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో దీనిపై ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకంలో ప్రస్తుతం రూ. వెయ్యి నుంచి 5 వేల వరకు పెన్షన్ అందుతోంది. By B Aravind 09 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Atal Pension Scheme: అటల్ పెన్షన్ యోజన పథకంలో కీలక మార్పులు జరిగే అవకాశాలున్నాయి. పెన్షన్ మొత్తాన్ని కేంద్రం రూ.10 వేలకి పెంచే దిశగా పరిశీలన చేస్తోంది. ఈ నెల 23న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో దీనిపై ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకంలో ప్రస్తుతం ఉన్న గ్యారెంటీ పెన్షన్ రూ.1000 నుంచి రూ. 5 వేల వరకు ఉంది. అయితే భవిష్యత్తు అవసరాలకు ఇది సరిపోదనే నేపథ్యంలో గ్యారెంటీ పెన్షన్‌ను రూ.10 వేలకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అటల్ పథకంలో 6.62 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. పెన్షన్‌ను రూ.10 వేలకు పెంచితే ఇందులో మరింత మంది చేరే అవకాశం ఉంటుంది. అసంఘటిత రంగంలో పనిచేస్తూ ఎలాంటి పింఛను స్కీమ్‌కు నోచుకోని వారికోసం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని కేంద్రం 2015 బడ్జెట్‌లో ప్రకటించింది. ఈ పథకంలో ప్రస్తుతం రూ. వెయ్యి నుంచి 5 వేల వరకు పెన్షన్ అందుతోంది. 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నవారు ఈ పథకంలో చేరవచ్చు. అయితే ఇందుకు అనుగుణంగా నెలనెలా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) దీన్ని నిర్వహిస్తుంది. Also Read: ఉత్పత్తులు నిలిపివేశాం.. సుప్రీంకోర్టుకు వెల్లడించిన పతంజలి #telugu-news #nirmala-seetharaman #atal-pension-scheme #centre-budget మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి