Rohan Bopanna: భారత టెన్నిస్ స్టార్, 43 ఏళ్ల రోహన్ బోపన్న (Rohan Bopanna) చరిత్ర సృష్టించాడు. శనివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 (Australian Open 2024) డబుల్స్ ఫైనల్ విభాగంలో తన సహచరుడు ఎబ్డెన్‌తో కలిసి ఫైనల్‌లో ఇటలీ జోడీ సిమోన్-వావాసోరిపై ఘన విజయం సాధించాడు. ఈ విజయంతో కెరీర్‌లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు బోపన్న. అంతేకాదు అతిపెద్ద వయసులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన టెన్నిస్ ప్లేయర్‌గానూ రోహన్ బోపన్న ఘనత సాధించడం విశేషం.
ఈ మేరకు శనివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను భారత్‌కు చెందిన రోహన్ బోపన్న-ఆస్ట్రేలియన్ మాథ్యూ ఎబ్డెన్ జోడీ 7-6(0) 7-5 తేడాతో అన్‌సీడెడ్ ఇటాలియన్ జోడీ సిమోన్ బోలెల్లి, ఆండ్రియా వవాస్సోరిపై ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నారు. ఇక ఇంతకు ముందు 2017 ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో కెనడాకు చెందిన గాబ్రియేలా డబ్రోవ్‌స్కీతో కలిసి బోపన్న గ్రాండ్‌స్లామ్ విజయం సాధించాడు.
తోటి ఆస్ట్రేలియన్ మాక్స్ పర్సెల్‌తో కలిసి 2022లో వింబుల్డన్ గెలిచిన తర్వాత ఎబ్డెన్‌కి ఇది రెండో పురుషుల డబుల్స్ టైటిల్. కాగా ఈ ఫైనల్‌లో సిమోన్ - వావాసోరి జోడీ నుంచి రోహన్ - ఎబ్డెన్‌కు టఫ్ ఫైట నడిచింది. ఫస్ట పాయింట్ నుంచి ఇరు టీమ్‌లు హోరాహోరీగా తలపడ్డాయి. మొదటి సెట్‌ను 7-6 (7/0)తో రోహన్ జోడీ నెగ్గింది.
ఇక రెండో సెట్‌లోనూ ఆటగాళ్లు విజయం కోసం నువ్వా నేనా? అన్నట్లు పోరాడారు. ఒక దశలో రోహన్ జోడీ 3-4తో వెనకబడినప్పటికీ మళ్లీ పుంజుకుంది. మ్యాచ్ ఫలితం మూడో సెట్‌కు వెళ్తుందా? లేదా? అనే టెన్స్ న్ మొదలవగా రోహన్ - ఎబ్డెన్ జోడీ అదరగొట్టేసింది. రెండో సెట్‌ను 7-5 తేడాతో నెగ్గి ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచింది. ఇక రోహన్ బోపన్నకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రోహన్‌కు ‘పద్మ’ పురస్కారం ప్రకటించింది.