AP Election Results: ఏపీ కాబోయే కొత్త సీఎం అతనే.. ప్రముఖ పంచాంగకర్తలు చెబుతున్న లెక్కలివే! అమలాపురానికి చెందిన ప్రముఖ పంచాంగకర్త ఉపదృష్ట నాగాదిత్య కూటమికి 135 సీట్లు వస్తాయంటున్నారు. 106 సీట్లతో జగన్ సీఎం అవుతారని సిద్ధాంతకర్త పల్లవార్దుల శ్రీరామకృష్ణ శర్మ అంటున్నారు. మరో ప్రముఖ జ్యోతిష్యులు తెన్నెంటి విక్రం బాబు ఒక్క సీటుతో అయినా వైసీపీదే విజయం అంటున్నారు. By Nikhil 30 May 2024 in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి AP Election Results Predictions: హోరాహోరీగా సాగిన ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఈ నెల 13 నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగుతోంది. ఇదే అంశంపై కోట్లలో బెట్టింగ్ లు సాగుతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అయతే.. కోనసీమలో ఇదే అంశంపై పండితుల పంచాంగాలు సైతం సాగుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా తాము చెప్పిందే నిజం కాబోతోందని పంచాంగ కర్తలు ధీమాగా చెబుతున్నారు. పార్టీల అధినాయకుల జాతకాల రీత్యా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెబుతున్నారు పంచాంగకర్తలు. అమలాపురానికి చెందిన ప్రముఖ పంచాంగకర్త ఉపదృష్ట నాగాదిత్య కూటమికి 135 సీట్లు వస్తాయని చెబుతున్నారు. 106 స్థానాల్లో విజయంతో జగన్ (YS Jagan) సీఎం అవుతారని మరో ప్రముఖ సిద్ధాంతకర్త పల్లవార్దుల శ్రీరామకృష్ణ శర్మ స్పష్టం చేస్తున్నారు. టీడీపీ (TDP) 69 స్థానాలకే పరిమితం అవుతుందని ఆయన అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్సే (Congress) గెలుస్తుందని తాను చెప్పానని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా తాను చెప్పిందే నిజమవుతుందని శ్రీరామకృష్ణ శర్మ ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాకుళానికి చెందిన ప్రముఖ జ్యోతిష్యులు తెన్నెంటి విక్రం బాబు చివరికి ఒక్క సీటు మెజార్టీతోనైనా వైసీపీనే (YCP) గెలుస్తుందని చెబుతున్నారు. అయితే.. పండితులు కూడా ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పడంతో రాజకీయ నాయకులు ఎటూ అంచనాకు రాలేక తలలు పట్టుకుంటున్నారు. వీరిలో ఎవరు చెప్పిన పంచాంగం నిజమవుతుందో తేలాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే! Also Read: మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం.. సంచలన ఆదేశాలు జారీ! #congress #ycp #ys-jagan #tdp #ap-election-results మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి