Venu Swamy : మళ్ళీ మొదలెట్టిన వేణు స్వామి.. నాగ చైతన్య - శోభిత జాతకం పై సంచలన పోస్ట్!

నాగ చైతన్య - శోభిత ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వేణు స్వామి..'నాగ చైతన్య, శోభితా ధూళిపాళ వైవాహిక జీవితం మీద సంచలనాత్మకమైన జాతక పరమైన విశ్లేషణ రేపు' అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంటులో స్టోరీ షేర్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

New Update
Venu Swamy : మళ్ళీ మొదలెట్టిన వేణు స్వామి.. నాగ చైతన్య - శోభిత జాతకం పై సంచలన పోస్ట్!

Astrologer Venu Swamy : అక్కినేని నాగ చైతన్య - శోభిత దూళిపాళ ఎట్టకేలకు తమ బంధాన్ని అధికారికం చేశారు. నేడు (ఆగస్టు 8) ఈ జంట ఎంగేజ్ మెంట్ చేసుకొని అందిరికీ షాక్ ఇచ్చారు. వీరి నిశ్చితార్థ వేడుక నాగార్జున ఇంట్లో చాలా సింపుల్ జరిగింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. నాగార్జున.. ట్విట్టర్ లో ఫోటోలు రిలీజ్ చేశారు. కాగా సోషల్ మీడియా వేదికగా అక్కినేని అభిమానులతో పాటు.. సెలబ్రిటీలు కూడా ఈజంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా వీరి ఎంగేజ్ మెంట్ జరిగి కొన్ని గంటలు గడవక ముందే సెలెబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి వాళ్లిద్దరి మ్యారీడ్ లైఫ్ గురించి చెబుతానని ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ''నాగ చైతన్య, శోభితా ధూళిపాళ వైవాహిక జీవితం మీద సంచలనాత్మకమైన జాతక పరమైన విశ్లేషణ రేపు'' అంటూ వేణు స్వామి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంటులో స్టోరీ షేర్ చేశాడు.

publive-image

ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ కాబోయే కొత్త జంటను ఆయన అప్పుడే టార్గెట్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి మొదట నాగ చైతన్య - సమంత విడాకులు తీసుకుంటారని జ్యోతిష్యం చెప్పింది ఈయనే. చెప్పినట్లుగానే వాళ్ళు డివోర్స్ తీసుకున్నారు. ఇప్పుడు అదే నాగ చైతన్య.. మరో హీరోయిన్ శోభితతో ఎంగేజ్ మెంట్ చేసుకోవడంతో ఈసారి వీళ్ళ గురించి ఎలాంటి బాంబ్ పేలుస్తాడోనని అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు.


#naga-chaitanya-sobhita #astrologer-venu-swamy
Advertisment
తాజా కథనాలు