Allahabad: యూనివర్సిటీలో దారుణం.. విద్యార్థినిపై అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ లైంగిక దాడి

అలహాబాద్‌ యూనివర్సిటీలో విద్యార్థినిపై అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అజయ్‌ కుమార్‌ అనే వ్యక్తి తనకు క్యాన్సర్ ఉందని నమ్మించి ఆమెను రూమ్ కు తీసుకెళ్లి దారుణం చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేయకపోవడంతో విద్యార్థులు ధర్నాకు దిగారు.

Rape case: తెలంగాణలో మరో దారుణం.. మద్యం తాగించి మహిళా కూలీలపై అత్యాచారం!
New Update

Allahabad University Rape Case: పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పి ప్రయోజకులను చేయాల్సిన ఉపాధ్యాయులే దారుణాలకు పాల్పడుతున్నారు. కూతురు వయసున్న ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ కౄరమృగాళ్లలాగ వ్యవహరిస్తున్నారు. అమాయకులైన అమ్మాయిలను మాయమాటలతో నమ్మించి కామవాంఛ తీర్చుకుంటున్నారు. కాదంటే బెదిరింపులకు పాల్పడుతూనో లేదంటే సబ్జెక్టులో ఫెయిల్ చేస్తామంటూనో లొంగదీసుకుంటున్నారు. లొంగని వాళ్లపై బలవంతంగా అత్యాచారాలకు పాల్పడుతూ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. ఇలాంటి ఘోరమైన సంఘటన అలహాబాద్‌ (Allahabad University) విశ్వవిద్యాలయంలో చోటుచేసుకుంది.

క్యాన్సర్‌ ఉందని నమ్మించి..
ఈ మేరకు బాధితురాలు, పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం.. అజయ్‌ కుమార్‌ (Ajay Kumar) అనే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (Assistant Professor) తనకు క్యాన్సర్‌ ఉందని మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. మొదట్లో ప్రేమ పేరుతో దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వార్ క్యాన్సర్‌ ఉందంటూ సెంటిమెంట్ క్రియేట్ చేశాడు. అయితే తన నుంచి ఎలాంటి సానుకూల స్పందన లభించకపోవడంతో రూటు మార్చాడు. తాను క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు బాధితురాలిని ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేశాడు. ఆ సాకుతో ఆమెతో తరచూ మాట్లాడేవాడు. గత నెల 25న బాధితురాలిని తన గదికి తీసుకెళ్లిన అజయ్‌ కుమార్‌ అఘాయిత్యానికి పాల్పడ్డట్లు విచారణలో తెలినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి : MLA Harish Rao: అబద్దాలతో ప్రభుత్వాన్ని నడపలేరు.. సీఎం రేవంత్‌పై హరీష్ ఫైర్

క్యాంపస్‌లో ధర్నా..
అయితే ఈ ఘటనపై బాధితురాలు యూనివర్సిటీ యాజమాన్యానికి, పోలీసులకు ఫిర్యాదుచేసింది. కానీ వారి నుంచి స్పందన కరువైందని, తనకు ఎలాగైనా న్యాయం చేయాలంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆవేదన చెందింది. దీంతో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌పై కేసు పెట్టాలంటూ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు చేపట్టారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ప్రయాగ్‌రాజ్‌ డీసీపీ దీపక్‌ భుకర్‌ తెలిపారు. పోలీసులు అజయ్‌ కుమార్‌ను అరెస్ట్‌ చేయకపోవడంతో విద్యార్థులు క్యాంపస్‌లో ధర్నా కొనసాగిస్తున్నారు.

#rape-case #allahabad-university #assistant-professor
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe