Himanta Biswa Sarma: నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా..!

సీఏఏ విషయంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ ఆర్సీలో నమోదు కాని ఒక్క వ్యక్తికి పౌరసత్వం లభించినా తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. సీఏఏను కేంద్రం నోటిఫై చేయడంతో అస్సాంలో జరుగుతున్న ఆందోళనలపై సీఎం ఇలా స్పందించారు.

Himanta Biswa Sarma: నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా..!
New Update

Assam CM Himanta Biswa Sarma:  మార్చి 11న దేశవ్యాప్తంగా సీఏఏని (CAA) కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంగతి తెలిసిందే. సీఏఏను కేంద్రం నోటిఫై చేయడంతో అస్సాంలో ప్రతిపక్షాలు నిరసనలు, సమ్మెలకు దిగాయి. ఈ అంశంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్పందించారు. ఈ చట్టంతో అస్సాంలో లక్షలాది మంది ప్రజల్లో భయాందోళన నెలకొందన్నారు. శివసాగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో హిమంతబిశ్వ మాట్లాడుతూ..నేను అస్సాం పుత్రుడిని అని అవసరమైతే తాను రాజీనామా చేయడానికైడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. పౌరసత్వం పొందిన, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్‌లో దరఖాస్తు చేసుకోని ఒక వ్యక్తి అయినా సరే కొత్త చట్టం కొంద పౌరసత్వం లభిస్తే..మొదట వ్యతిరేకించే వ్యక్తిని తానే అన్నారు. సీఏఏను ఇంతకుముందు అమలు చేసినట్లు కొత్తగా ఏమీ లేదని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పుడు పోర్టల్‌లో దరఖాస్తు చేసుకునే సమయం ఆసన్నమైందని హేమంత్ బిస్వా శర్మ (Himanta Biswa Sarma) అన్నారు. పోర్టల్‌లోని డేటాలో పూర్తి విషయం ఉందని...చట్టాన్ని వ్యతిరేకించే వారి వాదనలు వాస్తవంగా సరైనవా కాదా అనేది అందులో పూర్తిగా సమాధానం దొరకుతుందని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం సోమవారం నుంచి దేశవ్యాప్తంగా సీఏఏను అమలు చేయడంతో అస్సాంలో నిరసనలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ హెచ్చరించినప్పటికీ, కాంగ్రెస్ నేతృత్వంలోని 16 పార్టీల యునైటెడ్ ప్రతిపక్ష ఫోరమ్, అస్సాం (ULfA) మంగళవారం అస్సాంలో సమ్మెను ప్రకటించింది. అలాగే, అస్సాంలోని గౌహతి, బార్‌పేట, లఖింపూర్, నల్బారి, దిబ్రూఘర్, తేజ్‌పూర్‌తో సహా వివిధ ప్రాంతాల్లో పౌరసత్వ (సవరణ) చట్టం (CAA)కి వ్యతిరేకంగా ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (AASU) నిరసన వ్యక్తం చేసింది.

సీఏఏ చట్టం ప్రకారం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి అణచివేతకు గురైన ముస్లిమేతర వలసదారులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు భారత పౌరసత్వం ఇవ్వడం షురూ చేసింది. అయితే, ఇందులో, 31 ​​డిసెంబర్ 2014 వరకు భారతదేశానికి వచ్చిన వారందరికీ మాత్రమే పౌరసత్వం లభిస్తుంది. వీటిలో హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, పార్సీ, క్రైస్తవ మతాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: గీతాంజలి సూసైడ్.. సీఎం జగన్ మాస్ వార్నింగ్

#assam #caa #himanta-biswa-sarma
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe