Life Partner: జీవితంలో ఎలాంటి సమస్య రాకుండా ఉండాలంటే కాబోయే పార్టనర్‌ని ఈ విషయాలు అడగండి భాగస్వామిని ఎంచుకోవడం అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయాలలో ఒకటి. కుదిరిన వివాహానికి ముందు ఆర్థిక సమస్యలను చర్చించడం చాలా ముఖ్యం. భవిష్యత్తు, వృత్తి గురించి, కెరీర్ డెవలప్‌మెంట్ కోసం వారికి ఎలా మద్దతు ఇస్తారని అడగడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. By Vijaya Nimma 25 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Life Partner: ప్రస్తుత కాలంలో జీవిత భాగస్వామితో పట్టుమని 10 మాసాలు కూడా కలిసి ఉండలేకపోతున్నారు. భాగస్వామిని ఎంచుకోవడం అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయాలలో ఒకటి. ప్రేమ వివాహంలో సమస్యలు తక్కువగా ఉంటాయి, పెద్దలు కుదిర్చిన వివాహంలో తర్వాత ఎక్కువ సమస్యలు కనిపిస్తాయని చాలా అంటూ ఉంటారు. ప్రతి కుటుంబానికి స్వంత సంప్రదాయాలు, ఆచారాలు, మత విశ్వాసాలు ఉంటాయి. పెళ్లికి ముందు.. అమ్మాయి, అబ్బాయి తరపు కుటుంబ సంప్రదాయాలు, మత విశ్వాసాలు, పూజలకు సంబంధించిన ఆచారాల గురించి మాట్లడుకుంటారు. అయితే కొన్ని విషయాలను పెళ్లికి ముందే మాట్లడుకుంటే జీవితంలో ఎలాంటి సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. పార్టనర్‌ను అడగాల్సిన ప్రశ్నలు: కుదిరిన వివాహానికి ముందు ఆర్థిక సమస్యలను చర్చించడం కూడా చాలా ముఖ్యం. భవిష్యత్తు, వృత్తి గురించి, కెరీర్ డెవలప్‌మెంట్ కోసం వారు తదుపరి ఏమి చేయాలనుకుంటున్నారు, ఈ పనిలో వారి భాగస్వామి వారికి ఎలా మద్దతు ఇస్తారని అమ్మాయిలు అడగడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. పెళ్లికి ముందు కుటుంబ నియంత్రణ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఇది జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. ఎంత మంది పిల్లలను కలిగి ఉండాలనుకుంటున్నారు, తల్లిదండ్రుల ప్రణాళికలు, పిల్లల మధ్య అంతరం మొదలైనవాటి గురించి చర్చించడం మంచిది. ఒకరి స్వభావం గురించి మరొకరు మాట్లాడుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే కొన్నిసార్లు ఇది పెళ్లి తర్వాత పెద్ద సమస్యలకు దారి తీసుకుంది. అందువల్ల అలవాట్లు, స్వభావం, అవసరాలు మొదలైన వాటి గురించి భాగస్వామికి చెప్పాలి. అతని స్వభావం, అలవాట్ల గురించి అడిగి తెలుసుకుంటే బెటర్. ఉద్యోగ, సమయ సమస్యల కారణంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వస్తాయి. డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ రెండింటిలోనూ పని చేయాల్సిన కొన్ని ఉద్యోగ రంగాలు ఉన్నాయి కావున.. ఈ టైంలో ఇప్పుడు డే షిఫ్ట్‌లో పని చేసినా.. భవిష్యత్తులో రాత్రి షిఫ్ట్‌లో పని చేయాల్సి ఉంటుంది. లేదా పని కోసం దూరంగా వెళ్ళవలసి ఉంటుంది. అందుకని ఉద్యోగం, వృత్తి గురించి కూడా ముందే మాట్లాడాలని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి : డయాబెటిక్ రోగులు ఈ డ్రై ఫ్రూట్స్ తినకూండ ఉంటే బెటర్.. ఎందుకో తెలుసా..!! గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #jobs #life-partner #happy-life #financial-issues మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి