Asian Games 2023: క్రికెట్ అంటేనే సంచనాలకు కేరాఫ్.. ప్రతి మ్యాచ్‌లో ఏదో ఒక రికార్డ్ నమోదవ్వాల్సిందే. టీ20 అయినా.. వన్డే అయినా.. టెస్ట్ మ్యాచ్‌లు అయినా.. క్రికెటర్లు తమ ఆటతీరుతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంటారు. ఇందులో అద్భుతమైన రికార్డ్స్ ఉంటాయి.. అత్యంత చెత్త రికార్డ్స్ కూడా ఉంటాయి. తాజాగా అలాంటి పరమ చెత్త రికార్డ్ టీ20 హిస్టరీలో నమోదైంది. ఓ జట్టు అనూహ్యంగా 15 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫలితంగా మ్యాచ్‌లో ఘోర ఓటమిపాలైంది. మరి మ్యాచ్ ఎక్కడ జరిగింది. ఏ టీమ్స్ మధ్య జరిగింది.. పూర్తి వివరాలపై ఇప్పుడు లుక్కేద్దాం..
ఇదికూడా చదవండి: తిరుమల నడకమార్గంలో బోన్‌లో చిక్కిన మరో చిరుత.. లక్షితపై అటాక్ చేసిన ప్లేస్‌లోనే
ఆసియా క్రీడల్లో భాగంగా టోర్నమెంట్‌కు ముందుగానే.. కొన్ని క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మహిళ టి20 క్రికెట్ నిర్వహించారు. మంగళవారం నాడు ఇండోనేషియా, మంగోలియా జట్ల మధ్య మ్యాచ్ నడిచింది. అయితే, ఇండోనేషియా జట్టు ఏకంగా 172 పరుగుల భారీ తేడాతో మంగోలియాను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇండోనేషియా టీమ్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 కోల్పోయి 187 పరుగులు చేసింది. ఇక 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మంగోలియా టీమ్.. ఆదిలో ఆగమాగం అయిపోయింది. లక్ష్య చేధనలో చతికిల పడింది. ప్రత్యర్థి టీమ్ బౌలింగ్ ధాటికి మంగోలియన్ ప్లేయర్స్ క్రీజ్‌లో ఎక్కువసేపు నిలవలేకపాయరు. 10 ఓవర్లు ఆడి 15 పరుగులు మాత్రమే కొట్టారు. ఆ 15 పరుగులకే అందరూ ఆలౌట్ అయ్యారు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే.. ఈ టీమ్‌లో ఉన్న వారిలో ఏడుగురు మంచి బ్యాటర్లు కాగా.. వారంతా డకౌట్ అయ్యారు. అయితే, మంగోలియా జట్టుకు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. ఆ కారణంగా టీమ్ మెంబర్స్ కంగారుపడి ఉంటారని, బెటర్ లక్ నెక్ట్స్ టైమ్ అని వారిలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read:
Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్‌లో షెడ్యూల్ విడుదల? మరి ఎన్నికలు ఎప్పుడంటే?