Modi Oath Ceremony: భారత ప్రధాని మోదీ మరో ఐదేళ్ళు ఈ బాధ్యతలు నిర్వర్తించడానికి రెడీ అయ్యారు. ఎన్డీయే భాగస్వామ్య పక్సాలు అన్నీ మోదీనే ప్రధాని అభ్యర్ధిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో...ఆయన ప్రమాణం స్వాకారం చేయడానికి సిద్దమయ్యారు. మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణం చేయనున్నారు. అందుకే ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా విదేశీ నేతలను ఆహ్వానించనున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ అధినేలకు ఆహ్వానాలు పంపనున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే శ్రీలంక అద్యక్షుడు విక్రమసింఘేకు అహ్వానం అందిందని.. దానిని తమ అధ్యక్షుడు అంగీకరించారని శ్రీలంక అధ్యక్షుడి మీడియా కార్యాలయం వెల్లడించింది. అలాగే బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో మోదీ స్వయంగా మాట్లాడారని చెబుతున్నారు. ఇవాళ, రేపటిలోగా మిగతా నేతలకు కూడా ఆహ్వానాలు వెళ్ళనున్నాయి. 2014లో మోదీ మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో సార్క్ దేశాల అధినేతలు.. 2019లో బిమ్స్‌టెక్ దేశాల నాయకులు అతిధులుగా వచ్చారు.
మరోవైపు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినివ్వాల్సిందిగా శుక్రవారం నాడు ఎన్డీయే నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అధికారికంగా కోరనున్నారు. మిత్ర పక్షాల మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రెడీ అయింది. మెజారిటీ మార్క్ 272 సీట్లకు బీజేపీకు 32ఇంకా కావాల్సి ఉంది.
Also Read:Gold Rates : బంగారం ప్రియులకు తీపి కబురు..తగ్గిన పసిడి, వెండి ధరలు