Asia cup 2023 India vs Pakistan: వరల్డ్‌కప్‌కి 40 రోజుల ముందు కూడా టీమిండియా ప్రయోగాల పరంపరను కొనసాగిస్తూనే ఉంది. ఆసియా కప్‌లో రోహిత్ సేన తన తొలి మ్యాచ్‌ని సెప్టెంబర్ 2న ఆడనుంది. రైవల్ పాకిస్థాన్‌తో జరగనున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయనున్నట్టు సమాచారం. కేఎల్ రాహుల్ గాయపడడం.. భారత్ జట్టు ఆడనున్న తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవడంతో బ్యాటింగ్ ఆర్డర్‌లో ఛేంజెస్ చేయాలని టీమ్ మ్యానేజ్‌మెంట్ నిర్ణయించినిట్టు తెలుస్తోంది.
కోహ్లీ పొజిషన్ ఛేంజ్?
లిమిటెడ్ ఓవర్ల ఫార్మెట్లలో(వన్డే, టీ20) విరాట్ కోహ్లీ నంబర్-3 పొజిషన్‌లో ఎన్నో వండర్స్ చేశాడు. వన్ డౌన్(ఒక వికెట్ పడగానే దిగే ప్లేయర్)లో కోహ్లీ సృష్టించిన రికార్డులు ప్రపంచ క్రికెట్‌లో మరేవరికి సాధ్యం కాలేదు. రికీ పాంటింగ్ లాంటి క్రికెట్ దగ్గజాల రికార్డుల సైతం బ్రేక్ చేశాడు కోహ్లీ. ఆ పొజిషన్‌లో కోహ్లీని కాకుండా వేరే ఆటగాడిని..అది కూడా వన్డేల్లో ఊహించుకోవడం కష్టమే. అయితే రిపోర్ట్స్ ప్రకారం కోహ్లీని నంబర్-4లో ఆడించాలని టీమ్ మ్యానేజ్‌మెంట్ భావిస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే ఆ పొజిషన్‌లో ఫిట్ అయ్యే ఆటగాడి కోసం బీసీసీఐ దశాబ్ద కాలం అన్వేషణ కొనసాగిస్తూనే ఉంది.. యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనప్పటి నుంచి ఆ పొజిషన్‌లో ఆ లెవల్‌లో భర్తీ చేసే ఆటగాడు దొరకలేదు.
ఇది కరెక్టేనా?
ఓపెనర్లగా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహుల్ స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఇషాన్ తుది జట్టులోకి రానున్నాడు. అప్పుడు మరో ఓపెనర్ గిల్‌ని నంబర్-3లో ఆడించాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. గతంలో నంబర్-3 పొజిషన్‌లో గిల్ జింబాబ్వేపై సెంచరీ చేశాడు. కోహ్లీ నంబర్-4 స్థానంలో బరిలోకి దిగుతాడు. మాజీ కోచ్ రవిశాస్త్రి, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, కోహ్లీ ఫ్రెండ్ ఏబీడీ సైతం కోహ్లీని నంబర్-4లో ఆడించాలని సూచించారు. అయితే నంబర్-3లో టీమిండియాకు ఎన్నో మరుపురాని విజయాలు అందించిన కోహ్లీ బ్యాటింగ్ స్థానం మార్చడం కరెక్టెనా అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. వరల్డ్‌కప్‌కి ముందు ఇలా బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయడం మంచిది కాదన్నది ఫ్యాన్స్ వాదన. అయితే నంబర్-4కి మరో ఆటగాడు న్యాయం చేయలేకపోతున్నాడు అని.. కోహ్లీ మాత్రమే టీమ్ కోసం ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడని.. రాణించగలడని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. ఎవరు లేనప్పుడు కోహ్లీనే దిక్కు అవుతాడని అంటున్నారు. ఇక 2011 ప్రపంచకప్‌లోనూ కోహ్లీ నంబర్-3 పొజిషన్‌లో బ్యాటింగ్ చేయలేదని గుర్తు చేస్తున్నారు. అప్పుడు ఓపెనర్లగా సచిన్, సెహ్వాగ్ దిగితే.. వన్ డౌన్‌లో గంభీర్ వచ్చేవాడు. కోహ్లీ ఏ పొజిషన్‌లోనైనా అదరగొడతాడని.. అందుకే దిగ్గజాలు సైతం నంబర్-4లో కోహ్లీని ఆడిస్తే టీమ్‌కి మంచిదంటున్నారని చెబుతున్నారు. మరి చూడాలి అసలు టీమ్ స్ట్రాటజీ ఏంటన్నది!
ALSO READ: ఇదెక్కడి రన్ అవుట్‌రా బాబు.. ఎంతైనా పాక్ కదా.. అశ్విన్ కామెంట్స్!
Asia cup: టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో భారీ మార్పులు..కోహ్లీ వన్ డౌన్ కాదు బాసూ!
ఆసియా కప్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయనున్నట్టు సమాచారం. విరాట్ కోహ్లీని నంబర్-4 పొజిషన్‌లో ఆడించాలని టీమ్ మ్యానేజ్‌మెంట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఓపెనర్లగా రోహిత్-ఇషాన్, వన్ డౌన్‌లో గిల్‌ని ఆడించాలని.. ఎన్నో ఏళ్లుగా ఫుల్‌ఫిల్ అవ్వని నంబర్-4 పొజిషన్ బాధ్యతలను కోహ్లీ అప్పగించనున్నారన్న ప్రచారం జరుగుతోంది.
New Update
Advertisment