Asia Cup 2023: ఇండియా-పాక్‌ మ్యాచ్‌పై ఉత్కంఠ

భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ కొనసాగే పరిస్థితి లేదు. రిజర్వ్‌ డే రోజు సైతం కొలంబోలో వర్షం పడుతుండటంతో ఆట కొనసాగుతుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

New Update
Asia Cup 2023: ఇండియా-పాక్‌ మ్యాచ్‌పై ఉత్కంఠ

భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ కొనసాగే పరిస్థితి లేదు. రిజర్వ్‌ డే రోజు సైతం కొలంబోలో వర్షం పడుతుండటంతో ఆట కొనసాగుతుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా చిరకాల ప్రత్యర్థులు దైపాక్షిక సిరీస్‌ ఆడక సుమారు 20 సంవత్సరాలైంది. దీంతో ఈ రెండు జట్లు ఐసీసీ టోర్ని, ఆసియాకప్‌ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. దీంతో దాయాదీల మధ్య పోరు అంటేనే క్రికెట్‌ అభిమానులు పూనకాలతో ఊగిపోతుంటారు. ఆసియా కప్‌ 2023లో భాగంగా ఆధివారం ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత ఓపెనర్లు గట్టి పునాధులు వేశారు.

ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌లు హాఫ్‌ సెంచరీలతో చెలరేగడంతో ఓపెనర్లు 121 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం రోహిత్‌ శర్మ ఔట్‌ కావడంతో ఓపెనింగ్‌ పాట్నర్‌షిప్‌కు బ్రేక్‌ పడింది.18వ ఓవర్లో శుభ్‌మన్‌ గిల్‌ సైతం ఫెవీలియన్‌కు చేరాడు. దీంతో భారత్‌ 123 పరుగులకు ఇద్దరు ఓపెనర్లను కోల్పొయింది. ఓపెనర్ల నిష్క్రమణ అనంతరం విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ నిదానంగా ఆడే ప్రయత్నం చేశారు. అయితే 24.1 ఓవర్ల వద్ద భారత్‌ 147 పరుగులతో ఉన్న సమయంలో కొలంబోలో వర్షం కురువడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. అనంతరం వాన తగ్గగా మ్యాచ్‌ను 34 ఓవర్లకు కుదిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్‌ మరో 5 నిమిషాల్లో ప్రారంభం అవుతుందనుకునే సమయంలో మళ్లీ వర్షం పడటంతో మ్యాచ్‌ను రిజర్వ్‌ డేకు వాయిదా వేస్లున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

మరోవైపు ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. అంతర్జాతీయ వన్డే కేరీర్‌లో కేఎల్‌ రాహుల్‌ 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. పాక్‌పై భారత ఓపెనర్లు మరోసారి వందకుపైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా ఇవాళ మ్యాచ్‌ కొనసాగితే క్రీజ్‌లో విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని క్రీడా నిపుణులు భావిస్తున్నారు. పాక్‌తో మ్యాచ్‌ అంటే విరాట్‌ కోహ్లీకి ఎక్కడ లేని పూనకం వస్తుంది. వీరితో పాటు ఆల్‌ రౌండర్‌ హార్డిక్‌ పాండ్యా మంచి ఫామ్‌లో ఉన్నాడు. గత ఏడాది జరిగిన ఆసియా కప్‌లో హార్డిక్‌ పాక్‌పై భారత్‌ను గెలిపించాడు.

Advertisment
తాజా కథనాలు