Ashwin: సెలక్టర్‌లకు మద్దతు తెలిపిన అశ్విన్

వన్డే వరల్డ్‌ కప్‌కు ప్రకటించిన టీమ్‌లో సీనియర్‌ కీపర్‌ సంజు శాంసన్‌కు బదులు యంగ్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ను ఎంపిక చేయడంపై సెలక్టర్‌లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సీనియర్ స్పిన్నర్ అశ్విన్ సెలక్టర్‌లకు మద్దతుగా నిలిచాడు. ఇషాన్‌ కిషన్‌ అంతర్జాతీయ మ్యాచ్‌లో రాణిస్తున్నాడన్నాడు.

New Update
Ashwin: సెలక్టర్‌లకు మద్దతు తెలిపిన అశ్విన్

స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్‌ కప్‌ టోర్నికి ఇటీవల బీసీసీఐ జట్టును ప్రకటించింది. కాగా ఈ టీమ్‌లో సంజు శాంసన్‌కు బదులు కేఎల్‌ రాహుల్‌కు బ్యాకప్‌ కీపర్‌గా యువ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌ను తీసుకోవడంతో పెద్ద చర్చ జరుగుతుంది. పలువురు క్రీడా పండితులు సెలక్టర్‌ల నిర్ణయంపై మండిపడుతున్నారు. సీనియర్‌ ప్లేయర్లు అందుబాటులో ఉండగా పెద్ద టోర్నీలో బీసీసీఐ ప్రయోగాలు చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రయోగాలు స్వదేశంలో జరిగే దైపాక్షిక సీరిస్‌లో చేయాలని సూచించారు.

కాగా సెలక్టర్‌లకు సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మద్దతు తెలిపాడు. ఇషాన్‌ కిషన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్నాడని, అలాంటి ప్లేయర్‌ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నాడు. ఇషాన్‌ కిషన్‌ ఓపెనింగ్‌ చేయగలడని, 5వ స్థానంలో సైతం బ్యాటింగ్‌ చేయగలడన్న అశ్విన్‌.. ఇషాన్‌ కిషన్ టూ ఇన్‌ వన్‌ ప్లేయర్‌గా జట్టుకు ఉపయోగపడుతాడన్నాడు. ఇషాన్‌ కిషన్‌కు సంజు శాంసన్‌కు మధ్య పోటీనే లేదని అశ్విన్‌ స్పష్టం చేశాడు. అంతే కాకుండా స్వదేశంలో టోర్నీ జరుగుతుండటం యువ ఆటగాళ్లకు కలిసొచ్చే అంశమన్నారు. వారు తాము ఎంటో నిరూపించుకోవాల్సి సమయం ఇదేనని రవిచంద్రన్‌ అశ్విన్‌ పేర్కొన్నాడు.

మరోవైపు టీమిండియా మిస్టర్‌ 360గా పేరు తెచ్చుకున్న సూర్యకుమార్ యాదవ్.. ఈ టోర్నీలో కీలకమైన నెంబర్‌ 4వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగనున్నాడు. సూర్యకుమార్ యాదవ్‌ 25-40 ఓవర్ల మధ్యలో బ్యాటింగ్‌కు వస్తాడని, ఆ సమయం భారత ఇన్నింగ్స్‌కు చాలా కీలకమని భారత మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ అన్నాడు. ఒత్తిడిని తట్టుకొని బౌలర్ ఎవరనేది చూడకుండా టీమ్‌ను ముందుకు నడిపించాల్సిన బాధ్యత సూర్య కుమార్‌ యాదవ్‌పైనే ఉంటుందన్నారు. టీమిండియాకు ఎన్నో సంవత్సరాలుగా నెంబర్‌ 4లో బ్యాంటింగ్‌కు వచ్చే బ్యాటర్‌లు నిలకడగా రాణించకపోవడం మైనెస్‌గా మారిందని, కాని సూర్య వరల్డ్‌ కప్‌లో ఎలాంటి ప్రతిభ కనబర్చుతాడనేది ఉత్కంఠగా మారిందన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు