Ashwin : జంబో రికార్డు బద్దలు కొట్టిన స్పిన్ మాంత్రికుడు.. తొలి భారత బౌలర్!

భారత స్పిన్నర్ అశ్విన్ మరో మైలురాయిని చేరుకున్నాడు. ఇంగ్లాండ్ తో ఆడిన తన వందో టెస్టు మ్యాచ్ లో అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాడు. జంబో 132 మ్యాచ్‌ల్లో 35 సార్లు ఐదు వికెట్లు సాధించగా అశ్విన్ 100 టెస్టుల్లోనే 36సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేసి ఔరా అనిపించాడు.

New Update
Ashwin : జంబో రికార్డు బద్దలు కొట్టిన స్పిన్ మాంత్రికుడు.. తొలి భారత బౌలర్!

Ravichandran : టీమ్ ఇండియా(Team India) సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్(Ravichandran) మరో మైలురాయిని చేరుకున్నాడు. తన వందో టెస్టు మ్యాచ్‌ లో అద్భుతమైన ప్రదర్శనతో మరోసారి తన స్పిన్ మాయజాలం చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4వికెట్లు తీసిన అశ్విన్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్(England) ను దెబ్బతీయడంలో కీలపాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే తన వందో టెస్టులో 9 వికెట్లు పడగొట్టిన చాణక్యుడు.. ఒక ఇన్నింగ్స్‌లో అత్యథికసార్లు 5 వికెట్ల ప్రదర్శన చేసిన బౌలర్ గా నిలిచాడు.

కుంబ్లే రికార్డు బద్దలు..
ఈ మేరకు భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే(Anil Kumble) రికార్డును బద్దలు కొట్టాడు అశ్విన్. జంబో పేరిట ఉన్న 35 సార్లు 5 వికేట్ల ప్రదర్శనను అధిగమించాడు. కుంబ్లే 132 మ్యాచ్‌ల్లో 35 సార్లు ఫైవ్‌ వికెట్ల హాల్‌ సాధించగా అశ్విన్ కేవలం 100 టెస్టుల్లో 36సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేసి ఔరా అనిపించాడు. టెస్టు క్రికెట్‌ చరిత్ర అత్యధిక సార్లు 5 వికెట్ల ఘనత సాధించిన భారత బౌలర్‌గా అశ్విన్‌ రికార్డులెక్కాడు.

ఇది కూడా చదవండి: Ind Vs Eng: చివరి టెస్టులో ఇంగ్లాండ్ చిత్తు.. బెంబేలెత్తించిన స్పిన్నర్లు!

స్పిన్నర్లదే హవా..
ధర్మశాల టెస్టులో స్పన్నర్ల హవా సాగింది. మొత్తం 30 వికెట్లలో 26 వికెట్లు ఇరు జట్ల స్పిన్నర్లే తీయడం విశేషం. కాగా భారత బౌలర్లు అశ్విన్, కుల్‌దీప్‌, రవీంద్ర జడేజా కట్టుదిట్టమైన బంతులు సంధించి ఇంగ్లాండ్‌ను బెంబేలెత్తించారు. మరీ ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్‌లో కుల్‌దీప్‌ (5/72), అశ్విన్‌ (4/51) పోటాపోటీగా వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ (5/77) ఐదు వికెట్ల ప్రదర్శనతో తన శతక టెస్టును చిరస్మరణీయం చేసుకున్నాడు. అలాగే టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ చరిత్ర సృష్టించాడు. రన్ మిషన్ విరాట్‌ కోహ్లి పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు. విరాట్‌ 2016-17లో స్వదేశంలో జరిగిన నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 8 ఇన్నింగ్స్‌ల్లో 109.2 సగటున 655 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో యశస్వి 9 ఇన్నింగ్స్‌ల్లో ​93.71 సగటున 657 పరుగులు చేశాడు.

Advertisment
తాజా కథనాలు