SI Suicide : ఎస్సై ప్రాణం తీసిన కుల వివక్ష.. పురుగుల మందు తాగి శ్రీనివాస్ మృతి!

అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ మృతి చెందారు. గత నెల 30న పురుగుల మందు తాగిన ఆయన.. హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. కులవివక్ష, ప్రాంతీయ విభేధాలతో తన భర్తను వేధించారని ఆయన భార్య కృష్ణవేణి ఫిర్యాదులో పేర్కొన్నారు.

SI Suicide : ఎస్సై ప్రాణం తీసిన కుల వివక్ష.. పురుగుల మందు తాగి శ్రీనివాస్ మృతి!
New Update

Bhadradri Kottagudem : భద్రాధ్రికొత్తగూడెం జిల్లాకు చెందిన అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ మృతి చెందారు. గత నెల 30న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాస్.. హైదరాబాద్ (Hyderabad) లోని యశోద ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. కులవివక్ష, ప్రాంతీయ విభేధాలతో తన భర్తను వేధించారని ఆయన భార్య కృష్ణవేణి ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. ఉన్నతాధికారులు, సహచర సిబ్బంది వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఎస్సై శ్రీనివాస్ మరణ వాంగ్మూలం ఇచ్చారు. తన భర్త ఎస్సై శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి (Suicide) పాల్పడటానికి సీఐ జితేందర్ రెడ్డి సహా కానిస్టేబుళ్లు శివ, సుభానీ, సన్యాసి నాయుడు, శేఖర్ కారణమని పోలీసులకు శ్రీనివాస్ భార్య శ్రీరాముల కృష్ణవేణి ఫిర్యాధు చేశారు. కులవివక్ష, ప్రాంతీయ విభేధాలతో తన భర్తను వేధించారని ఫిర్యాధులో పేర్కొన్నారు.

కృష్ణవేణి ఫిర్యాధు మేరకు సీఐ జితేందర్ రెడ్డి సహా, నలుగురు కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ సెక్షన్ 306, 511 R/W 34 ఐపీసీ కింద కేసునమోదు చేశారు. అశ్వారావుపేట (Ashwaraopeta) ఎస్సై ఆత్మహత్యాయత్నం ఘటనలో వేధింపుల అభియోగాల నేపథ్యంలో సీఐ జితేందర్ రెడ్డిని ఐజీ కార్యాలయానికి, నలుగురు కానిస్టేబుళ్లను భద్రాధ్రికొత్తగూడెం ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వ్యులు జారీ చేశారు.

Also Read : ఏపీలో రేపటి నుంచి ఇసుక ఫ్రీ.. రూల్స్ ఇవే!

#passed-away #ashwaraopeta-constituency #si-sriramula-srinivas
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe