Rohit Kohli: కోహ్లీ, రోహిత్‌ టీ20 కెరీర్‌పై తేల్చేసిన స్టార్ బౌలర్.. ఏమన్నాడంటే!

అంతర్జాతీయ టీ20లు ఆడడం, ఆడకపోవడమన్నది వయసుకు సంబంధించిన విషయం కాదన్నాడు టీమిండియా మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా. రోహిత్, కోహ్లీని వారు కోరుకున్నంత కాలం అంతర్జాతీయ టీ20లు ఆడటానికి అనుమతించాలని సూచించాడు.

New Update
Rohit Kohli: కోహ్లీ, రోహిత్‌ టీ20 కెరీర్‌పై తేల్చేసిన స్టార్ బౌలర్.. ఏమన్నాడంటే!

Ashish Nehra About Virat & Rohit: వన్డే ప్రపంచకప్(World Cup 2023) ముగిసినప్పటి నుంచి అందరిచూపు రోహిత్(Rohit Sharma), కోహ్లీ(Virat Kohli) భవిష్యత్‌ ప్రణాళికలవైపు పడింది. అంతర్జాతీయ టీ20లకు ఈ ఇద్దరు రిటైర్‌మెంట్ ప్రకటిస్తారని కొందరు, వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ వరకు ఆడుతారని ఇంకొందరు ప్రచారం చేస్తున్నారు. పలు ప్రముఖ మీడియ సంస్థలు సైతం రోహిత్ టీ20లకు గుడ్‌బై చెబుతాడంటూ కథనాలు అల్లాయి. అయితే బీసీసీఐ నుంచి కానీ.. రోహిత్ నుంచి కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. వన్డే ప్రపంచకప్‌ ముగియడంతో రోహిత్‌ ఏదోక కీలక నిర్ణయం తీసుకుంటాడని అంతా భావించారు. ఇప్పటివరకైతే ఎలాంటి ఇన్ఫో లేదు. ఇదే సమయంలో టీమిండియా మాజీ ఆటగాడు, నాటి స్టార్ బౌలర్‌ ఆశిష్‌ నెహ్రా కోహ్లీ, రోహిత్‌ టీ20 కెరీర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.


నెహ్రా ఏం అన్నాడంటే?:
రోహిత్, కోహ్లీ వయసు వారి భవిష్యత్తును నిర్ణయించే ప్రమాణం కాకూడదన్నాడు నెహ్రా (Nehra). రోహిత్ వయసు 36, కోహ్లీ 35. ఈ ఇద్దరు యువకులు కానప్పటికీ.. టీ20లో ఆడడానికి, వయసుకు లింక్‌ పెట్టకూడదన్నాడు నెహ్రా. 'వయస్సు అనేది ప్రమాణం కాదు. మీరు ఎన్ని పరుగులు చేస్తున్నారన్నది ముఖ్యం. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ , శుభమాన్ గిల్ గురించి మాట్లాడాం ... కానీ రోహిత్ శర్మ ఆడాలనుకుంటే, వారంతా అతనితో పోటీ పడాలి. అతను 36- ఏళ్ళ వయసున్న సూపర్ యువకుడు. మనం విరాట్ కోహ్లి లేదా రోహిత్ శర్మ గురించి మాట్లాడేటప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి' అని కామెంట్ చేశాడు.

టీ20 ప్రపంచ కప్‌కు చాలా సమయం ఉందని... రోహిత్‌, కోహ్లీ ఆడాలని కోరుకుంటే, పరుగులు సాధిస్తుంటే టీమ్‌లో ఉంటే ఎలాంటి తప్పూ లేదు కదా అని ప్రశ్నించాడు నెహ్రా. రోహిత్, కోహ్లీని వారు కోరుకున్నంత కాలం అంతర్జాతీయ టీ20లు ఆడటానికి అనుమతించాలని సూచించాడు. విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో పరుగులు చేస్తున్నాడని.. అటు రోహిత్ శర్మ రాణిస్తున్నాడన్న విషయాన్ని గుర్తుచేశాడు నెహ్రా.

Also Read: మ్యాచ్‌ సమయంలో వర్షం కురుస్తుందా? రెండో టీ20కి ముందు వరుణుడి టెన్షన్!

WATCH:

Advertisment
తాజా కథనాలు