Ashika Ranganath : లక్కీ ఛాన్స్ కొట్టేసిన 'నాగ్' బ్యూటీ.. కోలీవుడ్ స్టార్ హీరోతో రొమాన్స్!

కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కోలీవుడ్ లో భారీ ఆఫర్ అందుకుంది. ఏకంగా తమిళ్ స్టార్ హీరో కార్తితో రొమాన్స్ చేయబోతోంది. కార్తీ హీరోగా తెరకెక్కనున్న ‘సర్దార్‌ 2’ లో హీరోయిన్‌గా అషికా రంగనాథ్‌ ను మూవీ టీమ్ సెలెక్ట్ చేసినట్లు సమాచారం.

Ashika Ranganath : లక్కీ ఛాన్స్ కొట్టేసిన 'నాగ్' బ్యూటీ.. కోలీవుడ్ స్టార్ హీరోతో రొమాన్స్!
New Update

Ashika Ranganath To Romance Karthi In Sardar 2 : టాలీవుడ్ (Tollywood) లో 'నా సామిరంగ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆషికా రంగనాథ్ (Ashika Ranganath).. ప్రస్తుతం సౌత్ లో వరుస ఆఫర్స్ అందుకుంటోంది. ఇప్పటికే మెగాస్టార్ 'విశ్వంభర' లో కీలక పాత్రలో నటిస్తున్న ఈ కన్నడ బ్యూటీ ఇప్పుడు కోలీవుడ్ (Kollywood) లో మరో ఆఫర్ అందుకుంది. ఏకంగా తమిళ్ స్టార్ హీరో కార్తితో రొమాన్స్ (Romance) చేయబోతోంది.

కార్తీ హీరోగా రూపొందిన ‘సర్దార్‌’ తమిళనాట భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘సర్దార్‌ 2’ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు పీఎస్‌ మిత్రన్‌. ఇందులో హీరోయిన్‌గా అషికా రంగనాథ్‌ ను మూవీ టీమ్ సెలెక్ట్ చేసినట్లు సమాచారం.

Also Read : ప్రభాస్ ఫ్యాన్స్ పై పోలీసుల లాఠీఛార్జ్..!

ఇప్పటికే ఈ విషయమై కథా చర్చలు పూర్తయినట్లు తెలిసింది. త్వరలోనే ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.కాగా కార్తి ప్రస్తుతం ఈ సినిమా కోసం లుక్‌ మార్చుకునే పనిలో ఉన్నారు. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్నఈ సినిమా కజకిస్థాన్, అజర్‌బైజాన్, జార్జియా తదితర దేశాల్లో షూటింగ్ జరుపుకోనుంది.

#sardar-2 #ashika-ranganath #karthi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe