Red Sandalwood: ఎర్రచందనం స్మగ్లింగ్ పై పవన్ స్పెషల్ ఫోకస్.. పెద్ద తలకాయలే టార్గెట్! విదేశాలకు అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న పెద్ద తలకాయలను పట్టుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని సూచించారు. By srinivas 05 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Pawan kalyan: విదేశాలకు అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న పెద్ద తలకాయలను పట్టుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని సూచించారు. ఈ మేరకు కడప జిల్లా పోట్లదుర్తిలో ఎర్రచందనం డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోగా.. రూ.1.6కోట్ల 158 దుంగలు దొరికాయని తెలిపారు. దీంతో శేషాచలం అడవుల్లో దాచిన దుంగలను గుర్తించాలని చెప్పారు. పవన్ మాట్లాడుతూ..'ఎర్రచందనం స్మగ్లర్ల నెట్‌వర్క్‌ను నడిపిస్తున్న సూత్రధారులను పట్టుకోవాలి. రవాణా దశలో, దాచి ఉంచిన దగ్గరో పట్టుకోవడంతో పాటు ఎర్రచందనం కూలీలు, రవాణా దారులను తెరవెనుక ఉండి నడిపిస్తున్నవాళ్లను గుర్తించి అరెస్టు చేయాలి. ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలను పరిశీలించాలి. నమోదైన కేసుల్లో ఎన్నింటిలో శిక్షలు పడ్డాయో, ఎన్ని కేసులు వీగిపోయాయో వివరాలు అందించాలి. ఇతర రాష్ట్రాలు, నేపాల్‌లో పట్టుబడ్డ కేసుల్లో అక్కడ ఉండిపోయిన ఎర్రచందనం దుంగలను తిరిగి తెచ్చుకోవడం దృష్టి పెట్టాలంటూ కీలక సూచనలు చేశారు. #chief-pawankalyan #red-sandalwood-smugglers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి