Ganesh Nimajjanam 2023: మద్యం తాగి నిమజ్జనానికి రావొద్దు.. 25 వేల మందితో భారీ బందోబస్తు.. సీపీ కీలక ప్రకటన భాగ్యనగర్‌లో గణపయ్య నిమజ్జనానికి ట్రై కమిషనరేట్ల పరిధిలో ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిమజ్జనం సవ్యంగా సాగేలా పోలీసుల ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు నిర్వాహకులు. బాలాపూర్ గణేష్ మొదలుకుని హుస్సేన్ సాగర్ వరకు 19 కిలో మీటర్ల శోభాయాత్ర కొనసాగనుంది. By Vijaya Nimma 27 Sep 2023 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి Ganesh Nimajjanam 2023: వినాయక నిమజ్జనానికి ట్రై కమిషనరేట్ల పరిధిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిమజ్జనం సవ్యంగా సాగేలా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలను నిర్వాహకులు ప్రతిష్టించారు. వినాయక నిమజ్జనానికి ట్రై కమిషనరేట్ల పరిధిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిమజ్జనం సాగేలా పోలీసుల ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలను నిర్వాహకులు ప్రతిష్టించారు. బాలాపూర్ గణేష్ హుస్సేన్ సాగర్ వరకు 19 కి.మీ శోభాయాత్ర జరగనుంది. అయితే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 25 వేల 694 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఉంచారు. జంక్షన్‌లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో పాటు పారామిలిటరీ బలగాలతో భద్రత నిర్వహించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 6 వేల మంది పోలీసులతో భద్రత నిర్వహిస్తున్నారు. ప్రతి విగ్రహానికి ఉన్నతాధికారులు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులు వస్తే వినియోగించుకోవడానికి అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. #CP_Rachakonda Sri DS Chauhan IPS, said #foolproof #security arrangements are made to complete the #GaneshImmersion peacefully. #Devotees should utilize the special amenities and cooperate with the #Police. #Ganeshotsav2023 #ganeshnimarjanam pic.twitter.com/c5HQyAPEUs — Rachakonda Police (@RachakondaCop) September 26, 2023 పోలీసులతో భద్రత కట్టుదిట్టం రాచకొండ కమిషరేట్ పరిధిలో గణేష్ నిమజ్జనానికి 56 చెరువుల దగ్గర ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నామని సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. నిమజ్జనాల నేపథ్యంలో క్రేన్ ఆపరేటర్ విధిగా 8 గంటలు డ్యూటీలో ఉండాలని ఆదేశించారు. రెండు క్రేన్లకు కలిపి అదనంగా మరో క్రేన్ ఆపరేటర్‌ను నియమించామన్నారు. ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ విషయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 228 పికెట్ ఏరియాలను చేపట్టామన్నారు. నిమజ్జనం సమయంలో మొబైల్ టాయిలెట్స్, ఆర్టీసీ నుంచి అదనంగా డ్రైవర్లను కూడా అందుబాటులో ఉంచామన్నారు. రూట్ టాప్, షీ టీమ్స్, మఫ్టీ పోలీసులతో భద్రత కట్టుదిట్టం చేశామని సీపీ వివరించారు. పోలీసుల హైసెక్యూరిటీ భక్తులు మద్యం సేవించి వినాయక నిమజ్జనానికి రావద్దని సీపీ డీఎస్ చౌహాన్ విజ్ఞప్తి చేశారు. వినాయక నిమజ్జనం కోసం 6 వేల మంది పోలీస్ సిబ్బంది ఉండగా.. మరో 1000 మంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారని వెల్లడించారు. నిమజ్జనం సందర్భంగా కమిషనరేట్ పరిధిలో కొన్ని ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయన్నారు. నిమజ్జనం కోసం సుమారుగా 3600 సీసీ కెమెరాలను వినియోగిస్తున్నామని సీపీ వెల్లడించారు. నేరేడ్‌మెట్, ఉప్పల్, నాగోల్‌లలో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశామని సీపీ డీఎస్ చౌహాన్ చెప్పారు. #hyderabad #vinayaka-immersion #arrangements #ganesh-nimajjanam-2023 #complete మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి