Encounter: జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పులు..నలుగురు సైనికులు మృతి! జమ్ముకశ్మీర్ లోని దోడా ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి దాటాక భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు మరణించారు. అందులో ఓ ఆర్మీ అధికారి కూడా ఉన్నారని స్థానిక పోలీసులు తెలిపారు. By Bhavana 16 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Jammu and Kashmir Encounter: దేశ సరిహద్దుల్లో టెర్రరిస్టుల చొరబాటు ఏ మాత్రం ఆగడం లేదు. దేశంలోకి వారు అక్రమంగా ప్రవేశించేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో భారత సైనికుల మీద ఉగ్ర మూకలు కాల్పులు తెగబడుతున్నాయి. తాజాగా జమ్ముకశ్మీర్ లోని దోడా (Doda) ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి దాటాక భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. టెర్రరిస్టులు సంచరిస్తున్నారనే ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారం మేరకు దేసా అడవుల్లో భారత సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ కొనసాగించారు. టెర్రరిస్టుల ఏరివేతకు అదనపు బలగాలు భారీగా మోహరించాయి. Defence Minister Rajnath Singh speaks to the Indian Army chief, who apprised him about the ground situation and ongoing operation in J&K's Doda: Sources pic.twitter.com/e5jWVulOBf — ANI (@ANI) July 16, 2024 అయితే ఈ క్రమంలోనే గాలింపు చర్యలను భారత సైనికులు, జమ్ముకశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ ముమ్మరం చేయగా ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి ఒక్కసారిగా కాల్పులకు దిగారు.ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు మరణించారు. అందులో ఓ ఆర్మీ అధికారి కూడా ఉన్నారని స్థానిక పోలీసులు తెలిపారు. #WATCH | Morning visuals from the Doda area of Jammu & Kashmir. An Encounter started late at night in the Dessa area of Doda in which some of the Indian Army troops got injured. (Visuals deferred by unspecified time) pic.twitter.com/ZQdSSRSjun — ANI (@ANI) July 16, 2024 టెర్రరిస్టులు, భారత సైనికులకు మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. గత 35 రోజుల్లో ఇది నాలుగో ఎన్‌కౌంటర్ అని స్థానిక పోలీసులు ప్రకటించారు. Also Read: వానలే.. వానలు.. మరికొన్నిరోజులు ఇలానే! #encounter #national #latest-news-in-telugu #jammu-and-kashmir మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి