జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌లో ఇటీవల టెర్రరిస్టు యాక్టివిటీలు పెరిగిపోతున్నాయి. పౌరుల మరణాలు.. ఎదురుకాల్పుల్లో జవాన్లు చనిపోవడం.. ఉగ్రవాదుల ఏరివేత.. ఇలా ప్రతీ అంశానికి పూంచ్ కేంద్రంగా మారుతోంది. పాక్ ఉగ్రసంస్థలు ఎక్కువగా పూంచ్‌నే టార్గెట్ చేశాయని.. అక్కడే మకం వేస్తున్నాయని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. గత వారం నలుగురు సైనికులు పూంచ్‌లో వీరమరణం పొందారు. ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఆకస్మిక దాడి చేశారు. ఈ ప్రాంతంలో భారత వ్యతిరేక కార్యకలాపాల జరుగుతున్నాయని అర్థమవుతోంది. ఇక రీసెంట్‌గా పూంచ్‌లో ఇటీవల ముగ్గురు పౌరులు చనిపోయిన విషయం తెలిసిందే.
ఈ మరణాలపై దర్యాప్తులో భాగంగా ఆర్మీ బ్రిగేడియర్ స్థాయి అధికారిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా అతడిని క్వశ్చన్ చేస్తున్నారు. ఈ అధికారి బాధ్యతలు నిర్వహిస్తున్న పరిధిలోనే ఉగ్రవాద చర్యలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆర్మీ అనుమానం వ్యక్తం చేస్తోంది. అటు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పూంచ్ సెక్టార్‌ను సందర్శించారు.
ఇదంతా జైషే మహ్మద్ చేస్తోందా?
పూంచ్ జిల్లాలోని ధాత్యార్ మోర్ సమీపంలోని బ్లైండ్ కర్వ్ వద్ద భారీగా సాయుధ ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి చేశారు. గతవారంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. తర్వాత గత శుక్రవారం, పూంచ్‌లోని బఫ్లియాజ్ ప్రాంతంలో ముగ్గురు పౌరులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. జైషే మహ్మద్‌తో సంబంధం ఉన్న పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (PAFF) సైనికులపై దాడికి బాధ్యత వహించింది.
పూంచ్ దాడుల వెనుక చైనా?
ఇస్లామాబాద్-బీజింగ్‌ల సమన్వయ వ్యూహంలో భాగమే ఈ హింసా జరిగిందని డిఫెన్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. భద్రతా బలగాలపై దాడులు చేయడం, రెచ్చగొట్టడమే లక్ష్యంగా పాకిస్తాన్ 25-30 మంది ఉగ్రవాదులను పూంచ్ అటవీ ప్రాంతాల్లోకి చొరబడేలా చేసిందని సమాచారం.
చైనా హస్తం ఉందా?
ఇస్లామాబాద్-బీజింగ్‌ల సమన్వయ వ్యూహంలో భాగమే ఈ హింసా జరిగిందని డిఫెన్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. భద్రతా బలగాలపై దాడులు చేయడం, రెచ్చగొట్టడమే లక్ష్యంగా పాకిస్తాన్ 25-30 మంది ఉగ్రవాదులను పూంచ్ అటవీ ప్రాంతాల్లోకి చొరబడేలా చేసిందని సమాచారం. గల్వాన్‌లో 2020 సరిహద్దు ఘర్షణల తర్వాత లడఖ్‌లో భారత్ ఎక్కువ మంది సైనికులను మొహరించింది. భారత సైనికులను తిరిగి కశ్మీర్‌కు మళ్లించడానికి చైనా ప్రయత్నిస్తోందని సమాచారం. చైనా మద్దతుతో పాకిస్థాన్ పశ్చిమంలో ఉగ్రవాదాన్ని పెంచుకుంటోందని చర్చ జరుగుతోంది. లడఖ్‌లో భారత్ సైనికుల సంఖ్యను తక్కువ చేసేలా పూంచ్‌లో పాకిస్థాన్‌తో కలిసి చైనా ఉగ్రవాదులను ఎగదోస్తుందని తెలుస్తోంది.
Also Read: ధోనీ, కోహ్లీ వల్ల కాలేదు.. మరి రోహిత్ చరిత్ర సృష్టిస్తాడా? 31ఏళ్ల నిరీక్షణకు తెరదించుతాడా?
WATCH: