Arijit Singh Song: కోలకతా ట్రైనీ డాక్టర్ హత్య.. పాటతో గొంతు వినిపించిన అర్జిత్ సింగ్

కోలకతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనకు వ్యతిరేకంగా ప్రజలు, ప్రముఖులు,సినీ తారలు నిరసనలు తెలియజేస్తున్నారు. తాజాగా సింగర్ అర్జిత్ పాట రూపంలో తన గొంతును వినిపించారు. 'ఆర్ కోబ్' పేరుతో పాటను విడుదల చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Arijit Singh Song: కోలకతా ట్రైనీ డాక్టర్ హత్య.. పాటతో గొంతు వినిపించిన అర్జిత్ సింగ్
New Update

Arijit Singh Song - Aar Kobe: కోలకతా ట్రైనీ డాక్టర్ (Kolkata Trainee Doctor) హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రాణం పొసే ఒక వైద్యురాలి  పై జరిగిన ఈ అమానవీయ చర్య ప్రజలందరి హృదయాలను కలచివేసింది. ఈ ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు, వైద్య కళాశాలలు, వైద్య విద్యార్థులు నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ కేసుకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పలువురు ప్రముఖులు, సినీ తారలు కూడా ఈ ఘటన పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోలకతా ట్రైనీ డాక్టర్ అర్జిత్ సింగ్ పాట

తాజాగా ప్రముఖ బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ కూడా ఈ ఘటన పై స్పందించారు.  పాట రూపంలో తన గొంతును వినిపించారు. 'ఆర్ కోబ్' అనే టైటిల్ తో తాను స్వయంగా రాసి, పాడిన పాటను విడుదల చేస్తూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. 'ఆర్ కోబ్' అంటే.. 'ఇది ఎప్పుడు ముగుస్తుంది' అని అర్థం. ఇది కేవలం నిరసన గీతం కాదు ... ఇది చర్యకు పిలుపు అనే శీర్షికతో న్యాయం చేయాలని డిమాండ్ రాశారు. ఈ సాంగ్ అంతటా పిడికిలి బిగించిన చేయి విప్లవాన్ని సూచించేలా కనిపిస్తుంది. అర్జిత్  పాడిన ఈ పాటను ప్రజలంతా ప్రశంసిస్తున్నారు. ఈ పాటను అర్జిత్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచారు.

Also Read: Naga Chaitanya: పెళ్లి ఎప్పుడు.. ఎక్కడో చెప్పేసిన నాగచైతన్య..? - Rtvlive.com

#kolkata-trainee-doctor-case #kolkata-doctor-case #arijit-singh #aar-kobe
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe