Health Tips: మీ చేతులు బలహీనంగా ఉన్నాయా..? ఆ వ్యాధులకు సంకేతమని తెలుసుకోండి

హ్యాండ్ గ్రిప్ మీ ఆరోగ్య రహస్యాన్ని చెబుతుందని నిపుణులు అంటున్నారు. మీ పట్టు సడలితే మీ రోగనిరోధక శక్తి బలహీనపడుతునట్లు అర్థం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మానవ శరీరంలో ఏ భాగంలోనైనా ఆటంకం కలిగినా..? దాని ప్రభావం మొత్తం శరీరంతోపాటు కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

New Update
Health Tips: మీ చేతులు బలహీనంగా ఉన్నాయా..? ఆ వ్యాధులకు సంకేతమని తెలుసుకోండి

Health Tips: మనిషి శరీరంలో ప్రతి అవయవం చాలా ముఖ్యమైనది. ఏ ఒక్క భాగానికి చిన్నపాటి దెబ్బ తగిలిన దాని నరకం అంతా ఇంతా కాదు. అంతే కాకుండా ఇలాంటి దెబ్బల వలన మనం కొన్ని పట్టుత్వాన్ని కోల్పోయే అవకాశం ఉండటంతో పాటు వ్యాధుల సంకేతం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందులో హ్యాండ్ గ్రిప్ మీ ఆరోగ్య రహస్యాన్ని చెబుతుందని నిపుణులు అంటున్నారు. మీ పట్టు సడలితే మీ రోగనిరోధక శక్తి బలహీనపడుతుందని అర్థం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మానవ శరీరంలో ఏ భాగంలోనైనా ఎలాంటి ఆటంకం కలిగినా..? దాని ప్రభావం మొత్తం శరీరంపై పడుతుంందని తెలుసుకోవాలని చెబుతున్నారు.  హ్యాండ్ పట్టుత్వాపై కొన్ని విషయాలును ఇప్పుడు తెలుసుకుందాం.

చేతులు వదులుగా ఉంటే వచ్చే వ్యాధులు ఇవే:

  • మనిషి శరీరంలో ఒక భాగం కూడా దెబ్బతిన్నట్లయితే.. అది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా.. మొదటగా చేతుల పట్టు వదులుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
  • అయితే కొందరిలో వయసు పెరిగే కొద్దీ చేతి పట్టు బలహీనపడుతుంది. ఇది సహజమైన ప్రక్రియ. చిన్నవయసులో చేతుల పట్టు వదులైతే అది ప్రాణాంతకమైన వ్యాధని వైద్యులు అంటున్నారు.
  • ఇది విశ్వాసాన్ని చూపడమే కాకుండా మీ ఆరోగ్యంతో లోతైన సంబంధాన్ని కలిగి ఉంటుందని అరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
  • చేతులు వదులుగా ఉంటే స్ట్రోక్, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్, డయాబెటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులను సూచిస్తుందని అంటున్నారు.
  • కొందరూ అనేక విధాలుగా చేతుల బలాన్ని పెంచుకోవడానికి శిక్షణ తీసుకుంటారు. అయితే.. మీరు ఇంట్లోనే రబ్బరు బంతితో సాధన, కూర్చొని చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: అరటిపండుతో పాటు పాలు తాగడం హానికరమా.. అందులో నిజం ఎంత..?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు