రోజూ వాకింగ్ చేస్తున్నా.. బరువు తగ్గటం లేదా ఈ చిట్కాలు పాటించండి!

బరువు తగ్గడానికి రోజూ ఉదయం, సాయంత్రం వాకింగ్‌ చేస్తున్నా.. మీ శరీరంలో మార్పు కనిపించలేదా? దీనికి.. వాకింగ్‌ చేసేటప్పుడు మీరు చేసే మిస్టేక్స్‌ కారణం కావొచ్చని అంటున్నారు నిపుణులు. మరి అవేంటి? నడిచేటప్పుడు ఎటువంటి టిప్స్‌ పాటించాలి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

రోజూ వాకింగ్ చేస్తున్నా.. బరువు తగ్గటం లేదా ఈ చిట్కాలు పాటించండి!
New Update

ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు 10 వేల అడుగులు వాకింగ్ కౌంట్ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. నడక సమయంలో బ్రేక్ తీసుకోవడం మంచిది. వాకింగ్ ఫార్ములాలు అంటూ ఏవీ లేవు. కానీ బెస్ట్ రిజల్ట్ కోసం మన బాడీ సైకిల్స్, రిథమ్స్ అర్థం చేసుకోవాలి. సీరియస్ ప్రీ మెడికల్ కండిషన్స్, ఏజ్, వంటి అనేక ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.’ అని చెప్పారు.

అయితే వాకింగ్ మీకు కంఫర్టబుల్‌గా ఉండేలాగా చూసుకోవాలి. క్రమంగా నడక సమయాన్ని, వేగాన్ని పెంచాలి. శరీరం వాకింగ్‌కు సులభంగా అలవాటుపడేలా చూసుకోవాలి. చాలా మంది నిపుణుల అభిప్రాయం ప్రకారం, వారానికి 150 నిమిషాలు నడవడం మంచిది. అయితే, శరీరం, శక్తిని బట్టి దీన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. వాకింగ్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. అవేంటంటే..ఆరోగ్యంగా ఉండాలంటే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించుకోవాలి. వేగంగా నడవడం వల్ల క్రమంగా బెల్లీ ఫ్యాట్ కరిగి, మరింత టోన్డ్ స్టమక్ సొంతమవుతుంది.

వాకింగ్ చేసినప్పుడు బాడీలో ఎక్స్‌ట్రా వెయిట్ తగ్గుతుంది. దీని కారణంగా హృదయనాళ వ్యవస్థ  బలోపేతం అవుతుంది. కండరాలు మరింత బలంగా తయారవుతాయి. లీన్ మజిల్ మాస్‌ లాస్ కాదు. రోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాలు వాకింగ్ చేస్తే బరువు తగ్గవచ్చు.రోజూ 30 నిమిషాలు వాకింగ్ చేస్తే 150 కేలరీలు బర్న్ అవుతాయి. స్వీట్స్ తినాలనే కోరిక తగ్గుతుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవు. మెటబాలిజం మెరుగుపడుతుంది. రోజంతా చురుకుగా, శక్తివంతంగా ఉంటారు.

#health-tips #health #walking
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe