Peanut Oil: వేరుశెనగ నూనెతో అందం.. ఆరోగ్యం.. ఇలా ట్రై చేసి చూడండి!

ప్రస్తుత కాలంలో మార్కెట్లో రకరకాల ఆయిల్స్ దొరుకుతున్నాయి. అయితే వీటిలో కల్తీ ఆయిల్‌ కూడా ఉండొచ్చు. వాటి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అందుకే ఆహారంలో వేరుశెనగ నూనె వాడాలని.. అది ఆరోగ్యంతో పాటు చర్మానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

New Update
Peanut Oil: వేరుశెనగ నూనెతో అందం.. ఆరోగ్యం.. ఇలా ట్రై చేసి చూడండి!

Peanut Oil Health Benefits: ప్రస్తుత కాలంలో మార్కెట్లో రకరకాల ఆయిల్ దొరుకుతున్నాయి. అవి మంచిదా..? కాదా..? అనేది తెలుసుకోవడం కూడా కొంచెం ఇబ్బందికర విషయమే. అయితే ఈ మధ్యకాలంలో కల్తీ ఆయిల్‌లో తయారీ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆయిల్ తీసుకొని ఆరోగ్యం పాడు చేసుకోకుండా మంచి ఆయిల్‌ను వాడాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. వేరుశెనగ నూనె కూడా మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వేరుశెనగ నూనెలో యాంటీ ఏజింగ్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది మన చర్మంపై ముడతలు, ముఖం, మెడ అంతటా రాస్తే నల్ల మచ్చలు, ఫైన్ లైన్స్ అన్ని తొలగిపోతాయి. వేరుశెనగ నూనెలో విటమిన్-ఈ అధికం. దీనిని తలకు రాస్తే చుండ్రు సమస్య తగ్గి, జుట్టు పెరిగేందుకు ఈ ఆయిల్ కృషి చేస్తుంది.

ఇది కూడా చదవండి: ఈ ఆహారాలతో షుగర్‌కు చెక్.. అవేంటో తెలుసుకోండి

వేరుశనగల్లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వేరుశెనగను ఆహారంలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, మినరల్స్, ఇతర ఆంటీ యాక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, సోడియం, ఫాస్పరసం, కాపరు వంటివి మన శరీరానికి చాలా బాగా మేలు చేస్తుంది. అంతేకాకుండా వేరుశనగల మాదిరిగానే వేరుశెనగ నూనె కూడా హెల్త్‌కి ఎంతో మంచిది. ప్రస్తుత కాలంలో అనేక ప్రాంతాలలో వేరుశనగ నూనెను వంటకి ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు, మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు అధికంగా ఉన్నాయి. వీటిని రోజువారి ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అయితే.. ఈ వేరుశనగ నూనె తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం.

వేరుశెనగ నూనె వాడితే కలిగే లాభాలు:

  • మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు ఎక్కువగా ఉండే వేరుశనగ నూనె చెడు కొలెస్ట్రాల్‌ను మంచి కొలెస్ట్రాల్నో పెంచడానికి ఉపయోగపడుతుంది. దీని ద్వారా గుండె, మధుమేహ,  శరీరంలో కొవ్వు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి వేరుశెనగ నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది
  • బరువు తగ్గాలనుకునేవారు వేరుశనగ నూనె ఆహారంలో తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. వేరుశెనగ నూనెలో ఉండే ఒలేయిక్ యాసిడ్ బిల్లీ ఫ్యాట్‌ని తగ్గించి బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.
  • వేరుశెనగ నూనె చర్మ సంరక్షణకు, మొటిమలను తగ్గించేందుకు వేరుశెనగ నూనె బాగా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియాల్లో గుణాలు మొటిమలను తగ్గిస్తుంది.
  • వేరుశెనగ నూనెలో కూడా యాంటీ ఏన్జీవో గుణాలు చర్మంపై ముడతలు పడకుండా చేస్తుంది. కొన్ని చుక్కల వేరుశెనగ నూనెను ముఖం, మెడ అంతటా రోజూ రాసుకుంటే నల్ల మచ్చలు, ఫైన్ లైన్స్, ముడతలు తొలగిపోతాయి.
  • వేరుశెనగ నూనెలో విటమిన్-ఈ అధికంగా ఉంటుంది. కావున వేరుశెనగ నూనెను తలకు పెట్టుకుంటే చుండ్రు సమస్య పోతుంది. ఈ వేరుశనగ నూనె జుట్టు కుదుళ్ళు మెరుగుపడి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

Advertisment
తాజా కథనాలు