dust allergy: ప్రస్తుతం చాలా మందికి వాతావరణ, సిజన్ మార్పు వల్ల అనారోగ్యం సమస్యలు ఎదురుకుంటున్నారు. ముఖ్యంగా వాతావరణ మార్పుతో జలుబు, తుమ్ములు, ఇతర అలర్జీ సమస్యల బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం డస్ట్ ఎలర్జీ. దానివల్లనే జలుబు, తమ్ములకు వస్తుంటే.. ఇక చలికాలంలో ఈ సమస్య మరి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం వింటర్ సీజన్‌లో పలు అలర్జీ సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ పరిస్థితిలో మిమ్మల్ని మీరు రక్షించుకుంటు, ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఆయుర్వేదంలో కొన్ని పద్దతులు ఉన్నాయి. ఈ రెమెడిస్‌ను పాటిస్తే మీకున్న డస్ట్ ఎలర్జీ సమస్యను పక్కకు పెట్టవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆవు నెయ్యి
డస్ట్ అలర్జీతో తరచుగా ఇబ్బంది పడుతుంటే ఆవు నెయ్యి మంచి పరిష్కారం. మీ ముక్కులో రెండు చుక్కల స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేయడం వల్ల అలర్జీలు నుంచి కాపాడుతుంది.
తేనె
తేనెకు ఆయుర్వేదంలో మంచి ప్రాముఖ్యత ఉంది. డస్ట్ అలర్జీ నుంచి ఉపశమనికి రెండు టీస్పూన్ల తేనెను తీసుకుంటే ప్రమాదకరమైన అలర్జీల నుంచి బయటపడుతారు.
పుదీనా టీ
డస్ట్ అలర్జీని అరికట్టడంలో పుదీనా టీ బెస్ట్ రెమెడీ. జలుపు, దగ్గు సమస్య ఉంటే పుదీన టీ తాగితే.. ఇన్‌స్టాంట్‌గా ఉపశమనం వస్తుంది. దీనిని రోజు తాగితే అలర్జీకి దూరంగా ఉంటుంది.
పసుపు పాలు
పుసుపు ఆంటిబయోటిక్ ఎక్కువగా దీనితో సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చు. ఎంతో మంచి ఔషధ గుణాలు ఉన్న పసుపు పాలు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు దివ్వ జౌషధంగా పని చేసి, సీజనల్ వ్యాధులకు దూరం చేస్తుంది.
గ్రీన్ టీ
గ్రీన్ టీ ఆరోగ్యానికి అనేక రకాలుగా ప్రయోజనం ఇస్తుంది. చేదుగా ఉండే ఈ గ్రీ టీని రోజూ తాగితే ఎన్నో అరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి. చాలామంది బరువు తగ్గడానికి గ్రీన్ టీ తాగుతారు. గ్రీన్ టీ ముఖ్యంగా దుమ్ము, ధూళి వల్ల కలిగే అలర్జీలను నివారించడంలో మంచి ఐటమ్.
తులసి
నియమ నిబంధనల ప్రకారం తులసికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇందులో ఎక్కువగా ఔషధ గుణాలున్నాయి. వేడి నీటిలో తులసి ఆకులను వేసి మరిగించి ఆ నీటి తాగితే అలర్జీకి ఫలితం ఉంటుంది.
ఇది కూడా చదవండి: ఎర్రటి పండుతో ముఖ సౌందర్యం అద్భుతం.. అదేంటో తెలిస్తే బ్యూటీ ప్రొడక్ట్స్‌కు చెక్
అలర్జీ చాలా సమస్యలకి ఈ చిన్న సమస్య కారణం అవుతుంది. ఇల్లు క్లీన్ చేసేటప్పు, బయటకు వెళ్లిన్నప్పుడు మాస్క్ వాడాలి. ముఖ్యంగా అలర్జీ ఉన్నవారు కాటన్, ఉతికిన మాస్క్‌లను వాడండితే బెటర్. కాగా.. కొంతమంది పడక బట్టల్ని పెద్ద పట్టించుకోరు. కావున వీటిని కచ్చితంగా వారానికి ఓసారైనా క్లీన్ చేసి కచ్చితంగా ఎండలో ఆరబెట్టాలి. అంతేకాకుండా ఎప్పుడైనా క్లీన్ చేసి తరువాత ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఆన్ చేసి, కిటికీలను తెరిచి ఉంచాలి. ఇంట్లో బాత్‌రూమ్స్, కిచెన్, ఎక్కడైనా వెలుతురు, గాలి వచ్చేలా చూసుకోండి. ఈ టిప్స్‌తో మీ సమస్యలు దూరం చేసుకోండి. మరిన్ని ఆనారోగ్య సమస్యలు ఉంటే మంచి వైద్యులను సంప్రదిస్తే మంచిది.