కాకరకాయలో విటమిన్-సి అధికంగా ఉంటుంది. దీనిని తినటం వలన రోగాలు దరిచేరవు. అధికమొత్తంలో విటమిన్-ఎ ఉండడంవల్ల చర్మ ఆరోగ్యం, కంటి చూపు, ఎముకలను మెరుగు పరుస్తుంది. కాకరకాయలో కేలరీలు తక్కువ.. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. వంద గ్రాముల కాకర తింటే రోజుకి అవసరమైన ఫైబర్‌లో ఎనిమిది శాతం మనకు అందుతుంది. వీటితోపాటు జింక్, ఐరన్, పొటాషియం తదితర ఖనిజాలు కాకరలో సమృద్ధిగా ఉన్నాయి. అంతేకాదు గాయాలను త్వరగా మానటానికి కాకర బెస్ట్ అంటున్నారు.
ఇది కూడా చదవండి: తక్కువ ధరతో ఎక్కువ లాభాలు.. జామకాయ చేసే మేలేంటో తెలుసా..?
అయితే.. కాకరకాయ తిన్న తర్వాత కొన్ని పదార్థాలను తీసుకోవడం అస్సలు మంచిదికాదన్న విషయం అందరూ గమనిచ్చాలి. ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలని ఆరోగ్య నిపుణులు. సూచిస్తున్నారు. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచేందుకు కాకర ఎక్కువగా దోహదపడుతుంది. అంతేకాకుండా రక్తాన్ని శుద్ధి చేసి, జీర్ణక్రియకు తోడ్పడుతుంది. శ్వాసకోశ వ్యవస్థను మెరుగుపరచటంలో కాకరకాయ మంచిదని వైద్యులు చెబుతున్నారు. అయితే.. గర్భిణులు ఈ కాకరకు దూరంగా ఉండడం ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ పదార్థాలు తింటే హెల్త్‌కి మంచిది కాదు
- కాకరకాయ తిన్న తర్వాత పాలు తాగటం అస్సలు మంచిదికాదు. ఇలా చేస్తే కడుపు సమస్యలు ఎక్కువ అవుతాయని చెబుతున్నారు. కాకరకాయ తిన్న తర్వాత పాలు తాగడం వల్ల నొప్పి, మలబద్ధకం, కడుపులో మంట లాంటి సమస్యలు ఎక్కువగా వస్తాయని వైద్యులు అంటున్నారు.
- కడుపు సంబంధిత సమస్య ఉన్నవారికి ఆ సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
- ప్రతి ఒక్కరికి ఆహారంలో పెరుగు తినడం అలవాటు. కానీ ఈ పెరుగును చేదు కూరగాయలతో కలిపి తీసుకుంటే అనేక వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
- చేదు కూరగాయ తిన్న తర్వాత ముల్లంగి, ముల్లంగితో చేసిన వంటలని తింటే మీరు శరీరానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ముల్లంగి, కాకర చేదు ప్రభావం పండుతోంది.
- దీనివలన గొంతు, ఎసిడిటీ, కఫం లాంటి సమస్యలు వస్తయి. కావున కాకరకాయ తిన్న తర్వాత ముల్లంగికి దూరంగా ఉంటే మంచిది.