భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తన 73వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆదివారం భారతీయ జనతా పార్టీ 'సేవా పఖ్వాడా'ను ప్రారంభించింది. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా నమో యాప్‌లో 'ఎక్స్‌ప్రెస్ యువర్ సేవా భావ్' ప్రచారాన్ని బీజేపీ ప్రారంభించింది. దేశానికి సేవ చేసే దిశగా దేశ పౌరులను ప్రేరేపించడమే ఈ ప్రచారం లక్ష్యం. ఈ ఏడాది ప్రతి భారతీయుడు నమో యాప్‌ని ఉపయోగించి ప్రధాని మోదీకి శుభాకాంక్షలు చెప్పవచ్చు. మీరు వీడియో సందేశం ద్వారా కూడా ప్రధాని మోదీకి మీ శుభాకాంక్షలు పంపవచ్చు. దీని కోసం మీరు మీ ఫోన్‌లో నమో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన వారందరి వీడియోలు వీడియో వాల్‌పై ప్రదర్శిస్తారు.
ఇది కూడా చదవండి: డైమండ్ లీగ్‌లో రెండో స్థానంతో సరిపెట్టుకున్న నీరజ్ చోప్రా..!!
ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి, మీరు మీ ఫోన్‌లో NaMo యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ IDతో నమోదు చేసుకోవాలి. సేవా పఖ్వాడా ప్రచారం సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు కొనసాగుతుంది. నమో యాప్‌లోని 'సేవా పఖ్వాడా' హోమ్‌పేజీలో, మీకు కొన్ని ఆఫ్షన్స్ కనిపిస్తాయి. ఇందులో వర్చువల్ ఎగ్జిబిషన్ కార్నర్, వీడియో గ్రీటింగ్స్, ఫ్యామిలీ ఈ-కార్డ్ సర్వీస్, భారత్ ఆన్ ప్రగతి పాత్, భారత్ సపోర్ట్స్ మోదీ వంటి ఆప్షన్‌లు ఉంటాయి.
ఇప్పుడు మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అభినందన సందేశం పంపాలనుకుంటే, మీరు వీడియో గ్రీటింగ్‌ల ఆఫ్షన్ కు వెళ్లాలి. దీని తర్వాత మీరు గ్రీటింగ్ వీడియోను రికార్డ్ చేసి ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీకి అందుతున్న శుభాకాంక్షల సందేశాలను మీరు చూడాలనుకుంటే, మీరు వీడియో వాల్‌పై క్లిక్ చేయవచ్చ. ఎందుకంటే శుభాకాంక్షల సందేశాల వీడియోలన్నీ వీడియో వాల్‌పై ప్రదర్శిస్తారు. ఇక్కడ మీరు వీడియో వాల్‌పై గ్రీటింగ్ వీడియోను లైక్ చేయవచ్చు. కామెంట్ చేయవచ్చు. షేర్ కూడా చేయవచ్చు.
ఇది కూడా చదవండి: యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌ను ప్రారంభించనున్న మోదీ…IICC ప్రత్యేకత ఏంటి?