Beer Benefits : బీర్ తాగడం(Drinking Beer) శరీరానికి ప్రమాదకరం కాబట్టి తీసుకోవద్దని వైద్యులు కూడా సలహా ఇస్తుంటారు. అయితే.. బీర్ మన శరీరానికి హానికరం అయినప్పటికీ మన ముఖానికి చాలా మేలు చేస్తుందని అంటున్నారు. అవును మీరు విన్నది నిజమే. మీ ముఖానికి బీర్ అప్లై(Applying Beer On Face) చేయడం వల్ల చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. బీర్‌లో మన చర్మానికి మేలు చేసే అనేక ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. బీర్ వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఔషధ గుణాలు:
- శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం బీర్‌లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి మన చర్మాన్ని మెరిసేలా, ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడతాయి. హాప్స్ అనే పువ్వు(Haffs Flower) ను బీరు తయారీలో ఉపయోగిస్తారు. ఈ పువ్వులో యాంటీ బాక్టీరియల్, యాంటీ మెలనోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
బీర్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
- బీర్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం(Apply Beer On Face) పై మొటిమలు(Pimples) తగ్గుతాయి. బీర్ ముఖంపై హైపర్పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది. ఎందుకంటే బీర్‌లో హైపర్‌పిగ్మెంటేషన్‌ను తగ్గించే హైడ్రోక్వినోన్ అనే సమ్మేళనం ఉంటుంది. బీర్ అప్లై చేయడం వల్ల ముఖంపై బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అలాగే మీ చర్మం మెరిసిపోతుంది.
ముఖానికి బీర్ ఎలా అప్లై చేయాలి?
- బీర్, ఆరెంజ్ జ్యూస్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖంపై కాటన్ బాల్‌తో అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ముఖానికి కొబ్బరి నూనె, బీర్ మిశ్రమాన్ని కూడా రాసుకోవచ్చు. దీని కోసం ఒక చెంచా కొబ్బరి నూనె, ఒక చెంచా బీర్ తీసుకొని కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని కడుక్కోవాలి. 3 స్ట్రాబెర్రీలను తీసుకుని వాటిని మెత్తగా చేసి టేబుల్ స్పూన్ బీరులో కలపాలి. ఇలా సిద్ధం చేసుకున్న పేస్ట్‌ని ముఖంపై అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కుంటే చర్మం మెరిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఎముకలను దృఢంగా మార్చే ఇంటి చిట్కాలు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.