Drinking : అతిగా మద్యం సేవిస్తే కలిగే దుష్ప్రభావాలు ఇవే

జీవనశైలిలో మద్యం ఒక భాగంగా మారింది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మన శరీరం సహజ రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా తగ్గిపోతుంది. సులభంగా వైరస్‌ల బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు.

Drinking : అతిగా మద్యం సేవిస్తే కలిగే దుష్ప్రభావాలు ఇవే
New Update

Alcohol : ఈ రోజుల్లో చాలా మంది వ్యక్తుల జీవనశైలి(Life Style) లో మద్యం ఒక భాగంగా మారింది. ఎక్కువగా పార్టీలు చేసుకుంటూ అతిగా మద్యం సేవిస్తున్నారు. అయితే ఆల్కహాల్(Alcohol) ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా దీనికి సంబంధించి ఓ అధ్యయనం ఆందోళన కలిగిస్తోంది. వేగంగా మారుతున్న జీవనశైలి కారణంగా ఈ రోజుల్లో జనాలు అనేక అలవాట్లకు బానిసలుగా మారుతున్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే ఈ అలవాట్లలో ఆల్కహాల్ ఒకటి. ఇటీవల మద్యపానానికి సంబంధించి ఒక అధ్యయనం వెలుగులోకి వచ్చింది. ఇందులో అధికంగా మద్యం సేవించే వారిలో సిర్రోసిస్‌ ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నట్టు తేలింది.

అధ్యయనం ఏం చెబుతోంది?

  • కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం(Cambridge University) వాళ్లు జరిపిన పరిశోధన ప్రకారం ఎక్కువగా మద్యం సేవించేవారిలో సిర్రోసిస్‌ వృద్ధి ఆరు రెట్లు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఆరోగ్యంపై ఎన్నో దుష్ప్రభావాలు ఉంటాయని తేలింది.

రోగ నిరోధక శక్తి తగ్గడం

  • ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మన శరీరం సహజ రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా తగ్గిపోతుంది. రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉంటే సులభంగా వైరస్‌ల బారిన పడతారని చెబుతున్నారు.

అధిక రక్త పోటు

  • మద్యం తాగితే రక్తపోటు(Heart Attack) పెరుగుతుంది. దీంతో గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

జీర్ణ సమస్యలు

  • అతిగా మద్యం సేవించడం వల్ల జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది విటమిన్లు మరియు పోషకాలను గ్రహించి ఆహారాన్ని జీర్ణం చేసే పేగుల సామర్థ్యాన్ని అడ్డుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.

మానసిక ఆరోగ్యంపై ప్రభావం

  • క్రమం తప్పకుండా మద్యం సేవించడం వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాం చూపుతుంది. ఆల్కహాల్ తాగే అలవాటు ఉంటే బైపోలార్ డిజార్డర్, యాంగ్జయిటీ, డిప్రెషన్‌లాంటి అనేక మానసిక రుగ్మతలను పెంచుతుందని అధ్యయనంలో వెల్లడైంది.

ఇది కూడా చదవండి: తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఇలా చేయండి.. అడ్డమైన ప్రొడక్ట్స్‌ కొనాల్సిన పని లేదు!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#life-style #alcohol #drinking #side-effects-of-alcohol
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe