/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Are-children-suffering-from-constipation.-follow-these-tips-jpg.webp)
Children Tips: సాధారణంగా చిన్న పిల్లల్లో మలబద్ధకం సమస్యలు వస్తాయి. డబ్బా పాలు, ఆవు, గేదె పాలు తాగే పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా వస్తాయి. దీనికి ప్రధాన కారణం శరీరానికి కావాల్సిన నీరు, పోషకాలు అందని పసివాళ్లలోనూ ఈ సమస్య అధికంగా ఉంటుంది. మలబద్ధకం ఉంటే పిల్లలు మల విసర్జన సరిగ్గా లేక, మల విసర్జన సమయంలో ఏడవడం వంటివి చేస్తారు. తల్లిదండ్రులు ఈ సమస్యను వెంటనే గుర్తించకపోతే పిల్లల కడుపు గట్టిగా మారుతుంది. కావున.. పిల్లలు మల, మూత్రాల విసర్జన సరిగ్గా చేస్తుందీ, లేనిది తల్లదండ్రులు ఖచ్చితంగా గమనించాలి. పిల్లలకు తల్లి పాలు కాకుండా బర్రె, డబ్బా, ప్యాకెట్, పౌడర్ పాలు తాగితే..అవి అరగక మల బద్ధకం వస్తుంది. ఈ మలబద్ధ సమస్యకు తగ్గాలంటే.. పిల్లల తాగుతున్న పాలలో నీళ్లు కలిపితే సులువుగా అరుగుతాయి. ఒకవేళ డబ్బా, పౌడర్ పాలు తాగే పిల్లలకు మలబద్ధకం ఉంటే.. తాగటం ఆపిస్తే మంచిది. పిల్లల్లో మల బద్దకం సమస్య తగ్గలేదంటే కొన్ని చిట్కాలు చూద్దాం.
పిల్లల్లో మలబద్దకం సమస్య తగ్గలేదంటే..
- పిల్లల్లో మలబద్ధకం తగ్గించడానికి ఎండు ద్రాక్ష ఎంతో మేలు చేస్తుంది. ఎండు ద్రాక్షను రాత్రంతా నీళ్లలో నానబెట్టి, ఉదయం ఆ నీళ్లలోనే వాటిని పిసికి పిల్లలకు తాగించాలి. ఇలా చేస్తే విరోచనం సాఫీగా అవుతుంది. పిల్లల్లో మలబద్ధకం ఉంటే ఆముదం పట్టడం వల్ల కడుపు శుభ్రమవుతుంది.
- ఇక 2,3 సంవత్సరాల పిల్లలకు మలబద్ధకం సమస్య ఉంటే.. ఆ పిల్లలు అన్నీ సరిగ్గా తింటున్నారా..? లేదా..? చూడాలి. సరిపడా మంచినీళ్లు తాగుతున్నారా..? లేదా..?అనుది చూడాలి.
- పిల్లలకు ఆకుకూరలు, కూరగాయలు చిన్నతనం నుంచే వాటిని తినే అలవాటు చేయాలి. నీళ్లు ఎక్కువగా తాగించాలి. ఎందుకంటే.. సరైన పౌష్టికాహారం తినకపోయినా మలబద్ధకం వస్తుంది.
- మలబద్ధకం వల్ల మల విసర్జన సమయంలో నొప్పి రాస్తుంది. పిల్లలు రెండు, మూడు రోజులకు ఒకసారి మల విసర్జన చేస్తుంటారు. ఇలా వేళ్తే పిల్లల అనారోగ్యంతో బాధపడుతున్నట్లు.
- ఎండు ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష మందు కాదు. ఇది చేదుగా ఉండదు. రెండూ తీపిగా ఉంటాయి. కావున పిల్లలు వీటిని ఇష్టంగా తింటారు.
- కోజూ చేయడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గి, పిల్లలకు అదనపు శక్తినిచ్చే కాల్షియం, ఐరన్ వస్తుంది.
ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆహారాలు ఇవే..!!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.