విశాఖలో ఆర్టీసీ బస్సు బీభత్సం.... కాకినాడలో బైక్ ను ఢీ కొట్టిన కారు...!

విశాఖలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఆర్కే బీచ్ గోకుల్ పార్క్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఫుట్ పాత్ మీదరకు దూసుకు వెళ్లింది. అక్కడే వున్న పార్కింగ్ బైక్ లపైకి దూసుకు వెళ్లింది. దీంతో 10 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఓ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో వున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయయి.

విశాఖలో ఆర్టీసీ బస్సు బీభత్సం.... కాకినాడలో బైక్ ను ఢీ కొట్టిన కారు...!
New Update

విశాఖలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఆర్కే బీచ్ గోకుల్ పార్క్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఫుట్ పాత్ మీదరకు దూసుకు వెళ్లింది. అక్కడే వున్న పార్కింగ్ బైక్ లపైకి దూసుకు వెళ్లింది. దీంతో 10 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఓ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో వున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయయి.

సింహాచలం డిపోకి చెందిన రూట్ నెంబర్ 28 బస్సు ఆర్కే బీచ్ నుంచి సింహాచలం వెళుతోంది. ఆర్కే బీచ్ సమీపంలోకి రాగానే బస్సు డ్రైవర్ కు ఒక్క సారిగా బీపీ పెరిగింది. దీంతో బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఫుట్ పాత్ పైకి దూసుకు వెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్రైవర్ ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

సెలవు దినం కావడంతో ఆదివారం ఆర్కే బీచ్ కు చాలా మంది సందర్శకులు వచ్చారు. తమ వాహనాలను రోడ్డుపై పెట్టి సముద్రం వద్దకు వెళ్లారు. ఘటనా సమయంలో అక్కడ సందర్శకులు ఎవరూ లేక పోవడంతో పెదను ముప్పు తప్పింది. లేదంటే భారీ ప్రమాదం జరిగి వుండేదని స్థానికులు వెల్లడించారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇది ఇలా వుంటే కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏలేశ్వరం మండలం ఎర్రవరం జాతీయ రహదారిపై అతి వేగంగా వస్తున్న బైక్ ను కారు ఢీ కొట్టింది. బైక్ పై భార్యా భర్తలు వాళ్ల చిన్న బాబుతో వెళుతున్నారు. అదే సమయంలో వేగంగా వచ్చి కారు డీ కొట్టడంతో ఆ ముగ్గురికి గాయాలయ్యాయి. తల్లి దండ్రుల పరిస్థితి విషమంగా వుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

#rtc #bike #accident #bikes #beach
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe