APPSC GROUP-2 : భారీగా పెరగనున్న గ్రూప్-2 పోస్టులు..నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త!

ఏపీలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఏపీపీఎస్సీ గ్రూప్-2 పోస్టుల విషయంలో నిరుద్యోగులు నిరుత్సాహంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టు నెలలో గ్రూప్-2లో 508 పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే గ్రూప్-2 పోస్టుల సంఖ్యను పెంచాలంటూ చాలా మంది అభ్యర్థులు ఎపీపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. దీంతో 750పైగా గ్రూప్ 2 పోస్టులు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కొన్నిరోజుల్లో సర్కార్ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.

APPSC Jobs: ఏపీలోని నిరుద్యోగులను అదిరిపోయే శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 6 నోటిఫికేషన్లు!
New Update

ఆంధ్రప్రదేశ్‎లోని నిరుద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుడ్‎న్యూస్ అందించనుంది. ఏపీపీఎస్సీ గ్రూప్-2 పోస్టుల విషయంలో నిరుద్యోగులు కొంత నిరుత్సాహంగా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో గ్రూప్-2లో 508 పోస్టుల భర్తీకి సర్కార్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ గ్రూప్-2 పోస్టుల సంఖ్య పెంచాలంటూ అభ్యర్థులు ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు సర్కార్ గ్రూప్- 2 పోస్టుల సంఖ్యను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గ్రూప్- 2 పోస్టుల సంఖ్య 750 కిపైగా పెంచుతున్నట్లు ఏపీపీఎస్సీ వర్గాలు వెల్లడించాయి. ఈనెలలో లేదంటే నవంబర్‎లో ఈ గ్రూప్ 2 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ 1, 2 అభ్యర్థులకు ఏపీ సర్కరార్ ఏ క్షణంలోనైనా శుభవార్త అందించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: ఈ ఆకులతో తయారు చేసిన టీ తాగితే.. వారం రోజుల్లో బరువు తగ్గుతారట..!!

ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల ఎంపిక ప్రక్రియతోపాటు పరీక్ష విధానం, సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ గైడెన్స్ తదితర వివరాలను త్వరలోనే ప్రకటించనుంది. మరికొన్ని రోజుల్లోనే గ్రూప్ 1, 2 నోటిఫికేషన్స్ రావడం ఖాయమని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ప్రిపరేషన్ ప్రారంభించే ముందు అభ్యర్థులు సిలబస్ పై పూర్తి అవగాహన ఏర్పరుచుకోవాలి. తాము పోటీ పడుతున్న పరీక్షకు సంబంధించిన సిలబస్ ను మరింత లోతుగా పరిశీలించాలి. గత ప్రశ్నలను ఓసారి అధ్యయనం చేయాలి. తర్వాతే ప్రిపరేషన్ ప్లాన్ డిజైన్ చేసుకోవాలి.

పరీక్ష విధానం ఈవిధంగా ఉంటుంది:
గ్రూప్ 2 పరీక్షను రెండు దశలుగా నిర్వహించనున్నారు. పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష జరుగుతుంది. మొదటి దశలో 150 మార్కులతో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారికి 1:50నిష్పత్తిలో రెండో దశ మెయిన్ పరీక్షకు సెలక్ట్ చేస్తారు. మెయిన్ లో ఒక్కో పేపర్ కు 150 మార్కులు ఉంటాయి. ఇలా రెండు పేపర్లు ఉంటాయి. ఈ పరీక్ష పూర్తి ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది.

ఇది కూడా చదవండి: టాలెంట్ కాదు.. ఇది ఒక్కటి ఉంటే జాబ్‌లో మిమ్మల్ని కొట్టేవాడే ఉండ‌డు బాసూ..!

#appsc-group-2 #appsc-group-2-jobs #appsc-group-2-posts-increase
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe