APPSC GROUP-2: ఏ క్షణమైనా ఏపీలో మెగా గ్రూప్-2 నోటిఫికేషన్.. మొత్తం ఖాళీలు ఎన్నంటే?

ఏపీలోని నిరుద్యోగులకు అలెర్ట్. గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు షరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. మరో 10రోజుల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 508గ్రూప్ 2 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ఆర్థిక శాఖ మరో 212 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అక్టోబర్ 20వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు క్యారీ ఫార్వార్డ్ పోస్టులు మరో 230 వరకు ఈ నోటిఫికేషన్ లో భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం 950పోస్టులను భర్తీ చేసే ఛాన్స్ ఉంది. ఈ పోస్టులకు రానున్న 10 రోజుల్లోనే నోటిఫికేన్ జారీ చేయాలని ఏపీపీఎస్సీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్

ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. పలు శాఖలో ఖాళీగా ఉన్న దాదాపు 950 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఎపీపీఎస్సీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. ఈ ఏడాది ఆగస్టు 28వ తేదీన 508 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి పర్మిషన్ ఇచ్చింది ఆర్థిక శాఖ. తాజాగా మరో 212 పోస్టుల భర్తీకి అమోదం తెలిపింది. ఈమేరకు అక్టోబర్ 20న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటితోపాటు క్యారీ ఫార్వార్డ్ పోస్టులు మరో 230 వరకు ఈ నోటిఫికేషన్ లో భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం 950పోస్టులను భర్తీ చేసే ఛాన్స్ ఉంది. ఈ పోస్టులకు రానున్న 10 రోజుల్లోనే నోటిఫికేన్ జారీ చేయాలని ఏపీపీఎస్సీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: NCERT సంచలన నిర్ణయం.. ఇకపై బుక్స్‌లో ‘ఇండియా’ పేరు ఉండదు..!

నేపథ్యంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల ఎంపిక ప్రక్రియతోపాటు పరీక్ష విధానం, సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ గైడెన్స్ తదితర వివరాలను త్వరలోనే ప్రకటించనుంది. మరికొన్ని రోజుల్లోనే గ్రూప్ 1, 2 నోటిఫికేషన్స్ రావడం ఖాయమని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ప్రిపరేషన్ ప్రారంభించే ముందు అభ్యర్థులు సిలబస్ పై పూర్తి అవగాహన ఏర్పరుచుకోవాలి. తాము పోటీ పడుతున్న పరీక్షకు సంబంధించిన సిలబస్ ను మరింత లోతుగా పరిశీలించాలి. గత ప్రశ్నలను ఓసారి అధ్యయనం చేయాలి. తర్వాతే ప్రిపరేషన్ ప్లాన్ డిజైన్ చేసుకోవాలి.

ఇది కూడా చదవండి: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్-3,282 ఉద్యోగాలకు నోటిఫికేషన్

గ్రూప్ 2 పరీక్షను రెండు దశలుగా నిర్వహించనున్నారు. పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష జరుగుతుంది. మొదటి దశలో 150 మార్కులతో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారికి 1:50నిష్పత్తిలో రెండో దశ మెయిన్ పరీక్షకు సెలక్ట్ చేస్తారు. మెయిన్ లో ఒక్కో పేపర్ కు 150 మార్కులు ఉంటాయి. ఇలా రెండు పేపర్లు ఉంటాయి. ఈ పరీక్ష పూర్తి ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది.

publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు