APPSC Group-2: కాసేపట్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష స్టార్ట్.. ఇవి మర్చిపోకండి! ఏపీ వ్యాప్తంగా ఇవాళ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ జరగనుంది. ఈ ఎగ్జామ్ కోసం 1,327 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉ.10:30 గంటల నుంచి మ. 1 గంట వరకు ఆఫ్‌లైన్ పద్ధతిలో పరీక్ష ఉంటుంది. మొత్తం 897 పోస్టులకు 4.5 లక్షల మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు. By Trinath 25 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ ఒంగోలు New Update షేర్ చేయండి APPSC Group-2 exam: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 పరీక్షను ఇవాళ(ఫిబ్రవరి 25, 2024) నిర్వహిస్తుంది. ప్రిలిమ్స్ పరీక్షలో అటెండ్ అవుతున్న అభ్యర్థులు తప్పనిసరిగా APPSC మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. APPSC గ్రూప్ 2 అడ్మిట్ కార్డ్‌తో పాటు చెల్లుబాటు అయ్యే ఫోటో ID ప్రూఫ్ హార్డ్ కాపీని పరీక్ష హాల్‌కు తీసుకెళ్లాలి. అభ్యర్థులు షిఫ్ట్ సమయాలను అనుసరించాలి. మొత్తం ఏపీ వ్యాప్తంగా 1,327 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్ జరుగుతుంది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆఫ్‌లైన్ పద్ధతిలో ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం 897 పోస్టులకు 4.5 లక్షల మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు. గైడ్‌లైన్స్: --> పరీక్ష ప్రారంభానికి కనీసం 60 నిమిషాల ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోండి. అభ్యర్థులు పరీక్షకు అవసరమైన అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేయాల్సి ఉంటుంది. --> ఎగ్జామ్ పూర్తి సమయం ముగిసే వరకు అభ్యర్థులు పరీక్ష హాల్ నుంచి బయటకు రాకూడదు. --> మొబైల్ / సెల్ ఫోన్‌లు, ప్రోగ్రామబుల్ కాలిక్యులేటర్‌లు, టాబ్లెట్‌లు, ఐప్యాడ్‌లు, బ్లూటూత్, పేజర్‌లు, గడియారాలు లేదా మరే ఇతర కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్ పరికరాల లాంటి వ్యక్తిగత వస్తువులను పరీక్ష హాల్‌లోకి అనుమతించరు. నాన్-ప్రోగ్రామబుల్ కాలిక్యులేటర్లు అవసరమైన చోట అనుమతిస్తారు. --> అభ్యర్థులు పరీక్ష రాసేటప్పుడు క్రమశిక్షణతో ప్రవర్తించాలి. --> మాస్ కాపీయింగ్ లాంటివి చేసిన వారు ఎంపిక నుంచి అనర్హులు. --> అభ్యర్థులు APPSC గ్రూప్ 2 అడ్మిట్ కార్డ్, చెల్లుబాటు అయ్యే ID హార్డ్ కాపీని పరీక్ష హాల్‌కు తీసుకెళ్లడం తప్పనిసరి. Also Read: పరీక్ష లేకుండానే ఉద్యోగం.. 56వేల జీతంతో ఇండియన్ నేవీలో జాబ్స్..! #jobs #appsc-group-2 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి