IPS Transfers: తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన వెంటనే భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ క్రమంలోనే బదిలీ చేసిన స్థానాల్లో అధికారులను నియమిస్తూ ఎన్నికల కమిషన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీలు, సీపీలు, కలెక్టర్లను నియమిస్తూ లిస్ట్ పంపింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరానికి సందీప్ శాండిల్యను నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
శాండిల్యది మొదటి పోస్టింగ్ గుంటూరు కాగా..నల్గొండ, ఆదిలాబాద్, కృష్ణా, సౌత్ జోన్ డీసీపీగా పని చేశారు. ఆ తరువాత 2016 నుంచి 2018 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఆయన పని చేశారు. అంతేకాకుండా ఆయన సీఐడీ, ఇంటిలిజెంట్ సెక్యూరిటీ వింగ్, అడిషనల్ పోలీస్ కమిషనర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ లో శాండిల్య విధులు నిర్వర్తించారు.
Also read: చంద్రబాబుకు పెట్టే భోజనంపై నాకు అనుమానం ఉంది: మంత్రి అమర్నాథ్ సంచలన ఆరోపణ
అంతేకాకుండా..జైళ్లశాఖ లో డీజీగా మూడు నెలల పాటు పని చేశారు. శాండిల్య ప్రస్తుతం పోలీస్ ఆకాడమీ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఇక రవాణాశాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్ ను నియమించగా, ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శిగా సునీల్ శర్మ నియామకం అయ్యారు.
ఎక్సైజ్ కమిషనర్ గా జ్యోతి బుద్ద ప్రకాశ్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా క్రిస్టినా పేర్లను అధికారులు తెలిపారు. యాదాద్రి కలెక్టర్ గా హనుమంత్ నియామకం కాగా..రంగారెడ్డి కలెక్టర్ గా భారతీ హోలీకేరీ, నిర్మల్ కలెక్టర్ గా ఆశిష్ సంగవాన్ , మేడ్చల్ కలెక్టర్ గా గౌతం ను నియమించింది.
వరంగల్ కమిషనర్ గా అంబర్ కిషోర్ ఝా, నిజామాబాద్ కమిషనరగా కల్మేశ్వర్, సంగారెడ్డి ఎస్పీగా రూపేశ్,మహబూబ్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ గా హర్షవర్థన్, సూర్యాపేట ఎస్పీగా రాహూల్ హెగ్డే, మహబూబాబాద్ ఎస్పీగా పాటిల్ సంగ్రం సింగ్, జగిత్యాల ఎస్పీగా సన్‌ప్రీత్ సింగ్, నారాయణపేట ఎస్పీగా యోగేశ్ గౌతం, జోగులాంబ గద్వాల ఎస్పీగా రితీరాజ్ బదిలీ మీద వెళ్లారు.